»   » ‘బాహుబలి’ ఆడియో లాంచ్ లో కరుణ్ జోహార్ చిరాకు

‘బాహుబలి’ ఆడియో లాంచ్ లో కరుణ్ జోహార్ చిరాకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ప్రముఖ దర్శకుడు యస్‌.యస్‌. రాజమౌళి రూపొందిస్తున్న ‘బాహుబలి' సినిమా ట్రైలర్ సోమవారం విడుదలయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్ర హిందీ వెర్షన్ ట్రైలర్ ని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ముంబైలో విడుదల చేశారు. విడుదల సమయంలో కరుణ్ జోహార్ చిరాకు పడ్డారు. అయితే దానికి కారణం..మీడియావారు. వారంతా కరుణ్ జోహార్ కు చెందిన ప్రతిష్టాత్మక చిత్రం 'శుద్ధి' ప్రాజెక్టు గురించి అడగటం మొదలెట్టారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ ప్రాజెక్టు చాలా కాలం నుంచి లేటవుతూ వస్తూండటంతో ఆ సినిమా గురించి ప్రశ్నలు సంధించటం మొదలెట్టారు. దాంతో కరుణ్ జోహార్... శుద్ది గురించి దయచేసి అడగటం ఆపండి..అందరినీ వేడుకుంటున్నా అంటూ విసుక్కున్నారు.

Why Karan Johar got irritated at Baahubali launch?

'శుద్ధి' విషయానికి వస్తే...

కరణ్‌ జోహార్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రకటించిన చిత్రం 'శుద్ధి'. ఇందులో ప్రధాన పాత్రల ఎంపిక ఇన్నాళ్లకు పూర్తయింది. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌', 'హంప్టీ శర్మకీ దుల్హనియా' చిత్రాల జోడీ వరుణ్‌ ధావన్‌, ఆలియా భట్‌ను 'శుద్ధి' కోసం ఎంపిక చేసినట్లు కరణ్‌ జోహార్‌ ట్వీట్‌ చేశాడు.

ఈ పాత్రల కోసం తొలుత హృతిక్‌ రోషన్‌, కరీనా కపూర్‌ను ఎంచుకొన్నారు. ఆ తర్వాత ఆ స్థానాల్లోకి రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె వచ్చారు. సినిమా ప్రారంభమవుతుందనుకున్న సమయంలో వీళ్లూ వెనకడుగేశారు. ఒక దశలో సినిమా ఆగిపోయిందేమో అనుకున్నారు.

అయితే అనూహ్యంగా సల్మాన్‌ ఖాన్‌ ఈ సినిమాలో నటిస్తాడని ప్రకటించారు కరణ్‌. హీరోయిన్ ఎంపిక మాత్రం జరగలేదు. తాజాగా ప్రధాన తారాగణంగా వరుణ్‌, ఆలియా పేర్లు ప్రకటించాడు కరణ్‌ జోహార్‌. సినిమాకు ఎంపికైనందుకుగాను వరుణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సల్మాన్‌ ఓ ట్వీట్‌ కూడా చేశాడు.

‘బాహుబలి' విషయానికి వస్తే..

ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రెండు నిమిషాల థియేట్రికల్‌ ట్రైలర్‌ సినిమా అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. ఆన్‌లైన్‌లో విడుదలయిన 24గంటల లోపే 10 లక్షల మందికి పైగా చూశారు. ఇప్పటి వరకూ ఏ సినిమా ట్రైలర్‌కు ఈ రకమైన ఆదరణ దక్కలేదంటే అతిశయోక్తి కాదు. దీంతో ట్రైలర్‌తోనే ‘బాహుబలి' రికార్డు సృష్టించింది.

English summary
Karan Johar got irritated at the trailer launch of 'Baahubali' when he was asked about his long-delayed project 'Shuddhi'. Karan Johar reacted: "OMG! I bow down to the all. Please, stop asking me about 'Shuddhi'."
Please Wait while comments are loading...