తెలుగుకి కత్రినా కైఫ్ 'నో' ఎందుకంటే
తెలుగు సినిమా ఇప్పుడు నన్ను తట్టుకోగలుగుతుందా? ప్రస్తుతం నాకున్న పాపులారిటీకి తగ్గ పారితోషికం తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చుకోగలదా..? అంటూ తెగేసి చెప్పింది కత్రినా కైఫ్.ఆమెను కలిసిన మీడియా..మళ్లీ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడు పలకరిస్తారు అని అడిగితే ఇలా స్పందించింది.గతంలో కత్రినాకైఫ్ తెలుగులో మల్లీశ్వరి,అల్లరి పిడుగు చిత్రాలు చేసింది.మల్లిశ్వరీ చత్రం విజయవంతం అయినా అల్లరి పిడుగు డిజాస్టర్ అయ్యింది.
సరిగ్గా అదే సమయంలో ఆమె హిందీలో పూర్తి బిజీ కావటంతో ఇక్కడ మళ్ళీ చేయలేదు.అయితే అప్పుడప్పుడూ పెద్ద హీరోల కోసం ఆమెని సంప్రదించి నో అనిపించుకుంటున్నారు.అయితే దానికి కారణం రెమ్యునేషన్ అని క్లియర్ చేసింది.ఇక కత్రినా తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ ..తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. అద్భుతమైన పాపులారిటీని సొంతం చేసుకున్నాను. మంచి సబ్జెక్ట్ వస్తే... మళ్లీ తెలుగులో చేస్తా. సౌత్‌లో అందరూ ప్రొఫెషనల్‌గా ఉంటారు అంది.ఇంతకీ ఏ హీరో ప్రక్కన ఆమెను తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











