మహేష్ సినిమాల జాప్యానికి నమ్రతే కారణమా??
పోకిరి సినిమాతో అప్పటి వరకు ఉన్న చలన చరిత్ర రికార్డులను తిరగ రాసిన మహేష్ బాబు ప్రస్తుతం భార్య, పిల్లలంటూ ఇంటి పట్టునే ఉంటూ కాలాన్ని వృధా చేస్తున్నాడు. సమారు ఆయన రెండు సంవత్సరాల నుడి ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. దీంతో విసిగిపోయిన అభిమానులు మహేష్ భార్య నమ్రతా ను అపార్ధం చేసుకుంటున్నారు. తనని సినిమాలలో నటించనీయకుండా ఎక్కువగా ఇంటిలో ఉండి తనతో, బాబుతోనూ గడిపేలా చేసిందని ఆమె పై లేని పోని అభండాలు వేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోగా భావించే హీరోల్లో ఒకడైన మహేష్ బాబు ఇలా సినిమాలకు దూరంగా ఉంటే అభిమానులు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి అలాగే వయసు కూడా ముదురుతోంది.
ముందు ముందు అసలు సినిమాలు చేయగలడా చెప్పండి. రెండు సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న చిత్రం కూడా ఇటు తెలంగాణ దాడుల వల్ల ఆగి, మళ్లీ షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో అతని సినిమా వచ్చే సరికి ఇంకా రెండు నెలలు పడుతుంది. ఇదేం బాగోలేదు అంటున్నారు అభిమానులు. విమర్శకులు మాత్రం రెండు సంవత్సరాలనుండి ఆగిన వాళ్లు ఇంకా రెండు నెలలు ఆగలేక పోతున్నారా! అయిన ప్రతి మనిషి నిత్యయవ్వనంగా ఉండలేడు కదా! కాలం తన పని తాను చేసుకోవాలి కదా!అంటు మహేష్ అభిమానులకు వారు వివరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











