మహేష్ రికార్డ్స్ పిచ్చిని ఇగ్నోర్ చేసి సినిమా ఎంజాయ్ చెయ్యండి: రాజమౌళి
ప్రస్తుతం టాలీవుడ్ నెం 1 డైరక్టర్ రాజమౌళి అని ఒప్పుకొవడానికి ఏ టాలీవుడ్ డైరక్టర్ కూడా వెనుకాడరు సరికదా, గర్వంగా ఒప్పుకుంటారు. అటువంటి స్థానాన్ని వరుస విజయాలతో సంపాదించారు. ఎదిగిన కొద్ది ఒదిగి వుండాలనే నియమాన్ని పాటిస్తూ తనకు నచ్చిన సినిమాలను నిర్భయంగా పొగుడుతూ వుంటారు. ఈ మధ్య కాలంలో ప్రతీ విషయంలో తన స్పందనను తెలియచేస్తున్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి మొన్న ఆ మద్యన కూడా దూకుడు దూల వాగుడంటూ శ్రీను వైట్ల చిత్రంపై ట్వీట్ చేసిన విషయం విధితమే
మహేష్ బాబు తన సినిమాను తానే ఇండస్ట్రీ హిట్ అని డిక్లేర్ చేసుకోవడం తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే కామెంట్స్. తన సినిమాల వరకు బిగ్గెస్ట్ హిట్ అని, 'ఇట్ ఈజ్ అఫిషియల్" అని అనుకోవడంలో తప్పు లేదు. ఇండస్ట్రీ హిట్ ను ఆఫీషియల్ గా ప్రకటించే కొలమానం కాని, దాని నిర్ణయించే ఒక కమిటి కాని లేనప్పుడు ఇట్ ఈజ్ అఫిషియల్ అనుకొవడం ఏమిటో అనిపిస్తోందని, అసలు మహేష్ కి ఈ రికార్డుల పిచ్చి ఏంటో అని ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ అవుతూ అపార్థం చేసుకొంటున్నారు. అందుకు రాజమౌళి స్పందిస్తూ..
'ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు డిక్లేర్ చేసుకోవచ్చు. మీకు పిచ్చి లెక్కలు ఇరిటేటింగ్ గా వుంటే, అవి పక్కన పెట్టి మీకు నచ్చిన సినిమాలను ఎంజాయ్ చెయ్యండి." అని అంటున్న రాజమౌళి మాటల్లో నిజం వుంది కదూ..


Click it and Unblock the Notifications











