అలా చేస్తే చిరంజీవి కోపగించుకునే వారు.. కానీ ఆయనే, మూగబోయిన ఫాంహౌస్?

Recommended Video

Mega Family Didn't Celebrate Sankranti This Year,You Know Why ? | Filmibeat Telugu

చిరంజీవికి చెందిన బెంగుళూరులోని ఫాంహౌస్ ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా మెగా కుటుంబం రాకతో సందడిగా ఉంటుంది. అయితే 2019 సంక్రాంతికి ఇక్కడ అలాంటి హడావుడి ఏమీ కనిపించలేదు. పండగ సందడి లేక పోవడంతో ఫాంహౌస్ మూగపోయింది.

సంవత్సరం అంతా సినిమా షూటింగులతో బిజీగా ఉండే మెగా ఫ్యామిలీ మెంబర్స్... ప్రతి ఏడాది సంక్రాంతికి బెంగుళూరు ఫాంహౌస్‌లో కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వారు అభిమానులతో పంచుకునే వారు. కానీ ఈ సారి అలా జరుగక పోవడంతో ట్రెడిషన్ బ్రేక్ అయినట్లు చర్చించుకుంటున్నారు.

అలా చేస్తే చిరంజీవి కోపగించుకునే వారు.. కానీ ఆయనే

అలా చేస్తే చిరంజీవి కోపగించుకునే వారు.. కానీ ఆయనే

గతంలో ఓ సందర్భంలో నాగబాబు మాట్లాడుతూ... సంక్రాంతికి మెగా ఫ్యామిలీ అంతా బెంగుళూరు ఫాం హౌస్‌లో కలుసుకుంటాం. ఏదైనా కారణం వల్ల ఎవరైనా అపుడు అక్కడికి రాకపోతే అన్నయ్య వారిపై చాలా కోపంగా ఉంటారు అని చెప్పారు. అయితే ఈ సారి చిరంజీవే సంక్రాంతి వేడుకలను రద్దు చేయడం హాట్ టాపిక్ అయింది.

ఈ సారి ఎందుకు ఇలా?

ఈ సారి ఎందుకు ఇలా?

ఈ సారి మెగాస్టార్ చిరంజీవినే ఫాంహౌస్‌లో సంక్రాంతి వేడుకలు వద్దని డిసైడ్ అయ్యారట. అందుకు కారణం ‘సైరా నరసింహారెడ్డి' మూవీ షూటింగే అనే ప్రచారం జరుగుతోంది. ఇంది ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ప్రాజెక్ట్. పైగా రామ్ చరణ్ నిర్మిస్తున్న మూవీ. పనికి బ్రేక్ ఇవ్వడం ఇష్టం లేకనే చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారట.

మెగాస్టార్ కమిట్మెంట్ అంటే కమిట్మెంటే..

మెగాస్టార్ కమిట్మెంట్ అంటే కమిట్మెంటే..

మెగాస్టార్ చిరంజీవి దేనికైనా కమిటైతే... దాన్ని పూర్తి చేసే వరకు ఆయన విశ్రమించరు. సైరా నరసింహారెడ్డి తన కెరీర్లోనే ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఆయన మరింత కసితో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ చాలా ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా కావడంతో పనికి బ్రేక్ ఇస్తే కొన్ని ఇబ్బందు ఏర్పడే అవకాశం ఉండటంతో ఇలా చేశారట.

తండ్రితో పాటు రామ్ చరణ్

తండ్రితో పాటు రామ్ చరణ్

‘వినయ విధేయ రామ' విడుదల ముందు వరకు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా గడిపినప రామ్ చరణ్ ఆ తర్వాత తను నిర్మిస్తున్న ‘సైరా' ప్రాజెక్ట్ వైపు షిప్ట్ అయ్యారట. సంక్రాంతికి ఎలాంటి సెలవు తీసుకోకుండా ప్రాడక్షన్ వ్యవహారాలను చూసుకన్నారట. తర్వలో ‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులో బిజీ అవుతుండటంతో మళ్లీ సమయం ఉండదని భావించిన రామ్ చరణ్ ఉన్న కొద్ది సమయాన్ని ఇటు వైపు కేటాయించారట.

తలో వైపు...

తలో వైపు...

బెంగుళూరు ఫాం హౌస్‌లో సంక్రాంతి సెలబ్రేషన్స్ లేక పోవడంతో... ఉపాసన ఈ సారి సంక్రాంతి వేడుకలను ఇన్‌స్టాగ్రామ్ ఆఫీసులో జరుపుకుంది. రామ్ చరణ్ బీజగా ఉండటం వల్ల ఆమెతో రాలేక పోయాడు. ఇక అల్లు అర్జున్ పాలకొల్లు వెళ్లి అక్కడే పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X