twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా: నరసింహా రెడ్డి , ఇంకా ఎప్పుడు మొదలు పెడతారు??

    సైరా నరసింహా రెడ్డి టాలీవుడ్ చాలా ఇంట్రస్ట్ గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్. టైతిల్ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంత హైప్ ఉన్న సినిమా ఇంకా ఒక్క న్యూస్ కూడా చెప్పటం లేదు.

    |

    సైరా నరసింహా రెడ్డి టాలీవుడ్ చాలా ఇంట్రస్ట్ గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్. టైతిల్ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంత హైప్ ఉన్న సినిమా ఇంకా ఒక్క న్యూస్ కూడా చెప్పటం లేదు. మెగాస్టార్ కెరీర్ లోనే ఇన పెద్ద బడ్జెట్ సినిమా ఇంతవరకూ రాలేదు. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ ని ప్రకటించీ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావటం లేదు. పాత్రలూ, టెక్నీషియన్లూ అంతా సిద్దంగానే ఉన్నారు. అయినా అటు నిర్మాత రామ్ చరణ్ గానీ ఇటు దర్శకుడు సురేందర్ రెడ్డి గానీ ఏమీ చెప్పటం లేదు.

    ఆగమేఘాల మీద కథ సిద్దం చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అనే విషయం ఎవ్వరికి అర్ధం కావడం లేదు. సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసి నెలలు కావొస్తోంది. కొన్ని నెలల క్రితమే స్టార్ట్ చేస్తామని చెప్పిన నిర్మాత రామ్ చరణ్ ఇంకా సినిమాను పట్టాలెక్కించలేదు. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా విదేశాలకు వెళ్లి గ్రాఫిక్స్ నిపుణులను కలిసి వచ్చాడు. అతను రాగానే అక్టోబర్ 20న మొదలవుతుందని చిత్ర యూనిట్ చెప్పింది. అయితే ఇప్పుడు మళ్లీ మరొక డేట్ ని ఫిక్స్ చేసుకుందట సైరా చిత్ర బృందం.

    Why Mega star's 'Sye Raa Narasimha Reddy' delayed

    అన్నీ ఒకేసారి సెట్ అయిన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో సినిమాను మొదలు పెట్టి ఏ మాత్రం ఆపకూడదని అందరు అనుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా అప్పుడు కొంచెం ఖాళీగా ఉంటాడట. దీంతో చిత్రాన్ని ఒక్కసారి సెట్స్ పైకి తీసుకెళితే అంతా సెట్ అవుతుందని డిసెంబర్ లోనే స్టార్ట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. మరి ఆ డేట్ అప్పుడైనా స్టార్ట్ చేస్తారో లేదా చూడాలి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే అమితాబ్ - జగపతి బాబు అండ్ సుదీప్ వంటి అగ్రనటులు సినిమాలో నటిస్తున్నారు.

    English summary
    Mega star Chiranjeevi’s 151st film, Sye Raa Narasimha Reddy went on the floors amidst much fanfare on August 22. While it was said that the shooting would commence in September there are no signs of it starting in October either.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X