కజన్ వైఫ్ ని మాయచేసి ముగ్గులోకి దించే నాగార్జున
కజన్ వైఫ్ ని ముగ్గులోకి దించే పాత్రలో నాగార్జున కనిపించిన చిత్రం అగ్ని వర్ష. అందులో రవీనా టాండన్ తో కొన్ని హాట్ సీన్స్ కూడా ఉన్నాయి. విలన్ లక్షణాలు ఉన్న ఈ పాత్ర ప్రభుదేవా చేతిలో చనిపోతుంది. ఇలాంటి కథతో రూపొందిన చిత్రం కాబట్టే అగ్ని వర్షను నాగార్జున డబ్బింగ్ కాకుండా అడ్డుకుంటున్నాడని తెలుస్తోంది. ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం బాలీవుడ్ లో రిలీజైన ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని ఆర్. హరి అనే నిర్మాత తీసుకుని తైలం శ్రీనాగరవర్మ సమర్పణలో ఎస్.ఎస్.ఎమ్. క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేసుకుని పబ్లిసిటీ ప్రారంబించాడు. అయితే ఈ విషయం పేపర్లు ద్వారా తెలుసుకున్న నిర్మాత వెంటనే రంగంలోకి దిగి తన లాయిర్ తో నోటీస్ ఇప్పించాడు. ఎగ్రిమెంట్ లో ఈ చిత్రం డబ్బింగ్ చేయకూడదని రాయించుకున్నామని పేర్కొంటూ. ఎందుకంటే నీచమైన పాత్ర గల ఆ చిత్రం రిలీజైతే తన ఇమేజ్ కు దెబ్బ అని భావించి ఆ పని చేసాడుట. అప్పట్లో అమితాబ్ బచ్చన్, ప్రభుదేవా, జాకీ ష్రాఫ్, మిళింద్ సోమన్, రవీనా టాండన్, దీప్తి భట్నాగర్, సోనాలి కులకర్ణి వంటి స్టార్స్ ఉన్నారు కదా అని ఉత్సాహంగా గెస్ట్ పాత్ర చేసాడు. కానీ ఇప్పుడదే పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ఈ చిత్రం కోసం నాగార్జున లీగల్ నోటీస్ ఇవ్వటంతో ఫిల్మ్ సర్కిల్స్ లో ఈచిత్రంపై ఆసక్తి పెరిగి రాత్రికి రాత్రి చాలా మంది అగ్నివర్ష హిందీ చిత్రం డీవిడీలు తెచ్చుకుని చూసేసారుట.


Click it and Unblock the Notifications











