త్రివిక్రమ్‌కు నో చెప్పా, వెంటనే సునీల్ నుండి కాల్.... మీకు పిచ్చిపట్టిందా?
Recommended Video

'అరవింద సమేత' చిత్రంలో అందరికీ గుర్తుండిపోయే పాత్ర పోషించాడు 'అందాల రాక్షసి' ఫేం నవీన్ చంద్ర. సినిమాలో ఎన్టీఆర్-నవీన్ చంద్ర మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలెట్ అయిందని చెప్పక తప్పదు. అయితే వాస్తవానికి నవీన్ ఈ సినిమాలో ముందు నటించకూడదని అనుకున్నాడట, తనను అప్రోచ్ అయిన తీరు బాగోలేదని ఫీలయ్యాడట. అయితే నేను నో చెప్పడంతో ఆ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏకంగా సునీల్ నుంచి కాల్ వచ్చింది అని నవీన్ చంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మూడు ముక్కలు చెప్పి కట్ చేశారు
ఫస్ట్ కాల్ సినిమా మేనేజర్ నుండి వచ్చింది. ‘‘మూడు రోజుల్లో షూటింగ్ ఉంది. త్రివిక్రమ్ సినిమా, మీరు వచ్చేయాలి'' అని మూడు ముక్కలు చెప్పి నేను వివరాలు అడిగేలోపే ఫోన్ కట్ చేశారు. ఒక ప్రాపర్ పర్సన్ నుండి ఛానల్ నుండి కాల్ రాలేదు అనిపించింది. అందుకే నాకు వేరే షూటింగ్ ఉంది చేయను అని చెప్పాను.... అని నవీన్ చంద్ర తెలిపారు.

సునీల్ నుంచి కాల్, మీకు పిచ్చి పట్టిందా అంటూ మేనేజర్
వారం తర్వాత సునీల్ మా మేనేజర్ రాజా రవీంద్రకు ఫోన్ చేసి మీవోడు ఏంటి త్రివిక్రమ్ సినిమా వదులుకున్నాడు అని చెప్పాడట. ఈ విషయంమై ఆయన నాకు కాల్ చేసి మీకేమైనా పిచ్చి పట్టిందా? అన్నాడు. ఏమైంది సర్ అంటే... త్రివిక్రమ్ సినిమా చేయనని చెప్పారటకదా అన్నారు. చేయనని చెప్పలేదు సర్, ఇలా సినిమా షూటింగ్ మొదలవుతుందని చెప్పారు కానీ ఏమిటనేది ప్రాపర్ గా చెప్పలేదు అన్నాను.... అని నవీన్ చంద్ర గుర్తు చేసుకున్నారు.

నిర్మాతతో మాట్లాడి సెట్ చేశారు
వెంటనే రాజా రవీంద్రగారు నిర్మాత చినబాబు గారితో మాట్లాడారు. వాస్తవానికి బాల్‌రెడ్డి అనే పాత్రను కాస్టింగ్ చేసింది త్రివిక్రమ్ గారు కాదు చినబాబుగారు. అందాల రాక్షసి చేసిన అబ్బాయి ఈ పాత్రకు బావుంటాడు కదా అని త్రివిక్రమ్‌కు ఆయన చెబితే ఆయన వెంటనే ఒప్పుకుని పిలిపించండి మాట్లాడదాం అన్నారట.

నా జీవితంలో మరిచిపోలేను
పిలవగానే నేను వెళ్లాను.. నాతో మాట్లాడి కథ చెప్పారు. ఆ మూమెంట్ నా జీవితంలో మరిచిపోలేను. త్రివిక్రమ్ గారు అలా సోఫామీద కూర్చున్నారు. నా పాత్ర గురించి చెబుతుంటే అప్పటి వరకు నాలో ఒక భయం ఉండిపోయింది. ఆయన పెద్ద రైటర్, పైగా అతడు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కథచెప్పడం మొదలు పెట్టగానే కొన్ని నిమిషాల్లోనే బాల్ రెడ్డి పాత్రలోకి తీసుకెళ్లారు... అని నవీన్ చంద్ర గుర్తు చేసుకున్నారు.

ఏం చేయడానికైనా సిద్ధమయ్యారు
ఆయన కథ చెప్పడం పూర్తవ్వగానే సర్ ఈ పాత్ర కోసం ఏదైనా చేయడానికి సిద్ధమని చెప్పాను. గతంలోనే త్రివిక్రమ్ గారు అందాల రాక్షసి, నేను లోక్ చిత్రాల్లో నా వర్క్ ను మెచ్చుకున్నారు. ఎన్టీఆర్ గారికి కూడా థాంక్స్ చెప్పాలి. నవీన్ చంద్ర అనగానే ఆయన కూడా బావుంటుందని ఒప్పుకున్నారట.


Click it and Unblock the Notifications











