తెలుగులో ఒప్పుకోకపోవటానికి 'సింహా' నే కారణం...నయనతార
తెలుగులో నేను సినిమాలు చేయలేకపోవడానికి కారణం అవకాశాలు లేక కాదు. తమిళం, తెలుగులో నా ప్రీవియస్ మూవీ 'సింహా' నాకు హోమ్లీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అంతకుముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నేను చేసిన 'తులసి' సినిమాలో కూడా హోమ్లీగా ఉండే పాత్ర చేసినా..ఆ పాత్రలో గ్లామర్ పండించే అవకాశం ఉంది కాబట్టి కాస్త గ్లామరస్ కూడా కనిపించా. కానీ 'సింహా' విషయంలో అలాకాదు. పూర్తి సంప్రదాయబద్ధంగా కనిపించాల్సి వచ్చింది. ఆ పాత్ర తర్వాత మళ్లీ నేను తెలుగులో చేసే పాత్ర ఎలా ఉండాలి అనే అంశం గురించే ప్రస్తుతం ఆలోచిస్తున్నా. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలే ఎక్కువగా చేశా. ఇక నుంచి పాత్ర, నటన విషయంలో కూడా శ్రద్థ చూపించాలనుకుంటున్నాను. గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తే సరిపోదు. గుర్తుండిపోయే పాత్రలు చేయాలి. అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నా అంటోంది నయనతార.


Click it and Unblock the Notifications











