Toxic యష్‌కు షాకిచ్చిన స్టార్ హీరోయిన్.. టాక్సీక్‌ నుంచి తప్పుకోవడం వెనుక ట్విస్ట్ అదే!

బాలీవుడ్‌పై , భారతీయ సినిమాపై ప్రభావం చూపిన నటీనటులు అతికొద్దిమందే వుంటారు. అలాంటి వారిలో కరీనా కపూర్ ఒకరు. రాజ్ కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సైఫ్ అలీఖాన్‌తో వివాహం తర్వాత కొన్నాళ్లు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన ఆమె.. తిరిగి రీ ఇంట్రీ ఇచ్చారు. ఇద్దరు బిడ్డలకు తల్లీ అయినా కరీనా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దుమ్ము రేపుతున్నారు.

ఇకపోతే.. కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ''టాక్సిక్ '' చిత్రంలో కరీనా ఓ కీ రోల్ పోషించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో యశ్ సోదరి పాత్ర అది. దీంతో టాక్సిక్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కానీ అంతలోనే కరీనా కపూర్ టాక్సిక్ నుంచి తప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్యారెక్టర్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించనున్నారన్నది ఈ వార్తల సారాంశం. అయితే దీనిని చిత్ర యూనిట్ అధికారికంగా ధ్రువీకరించలేదు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడం.. దీనికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తుండటంతో ''టాక్సిక్''పై భారీ అంచనాలున్నాయి.

why Nayanthara REPLACES Kareena Kapoor Khan In Yash Starrer Toxic Heres What We Know

డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లే కరీనా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్నా .. వేరే కారణాలు వున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 1960వ దశకంలో గోవాలోని డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ఫిలింనగర్ టాక్. అలాగే అండర్ వరల్డ్, చీకటి వ్యాపారాలు, స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించిన అంశాలను టాక్సిక్‌లో టచ్ చేసే అవకాశం వుందని సమాచారం. సినిమా ఇతివృత్తం గురించి కరీనాకు ముందుగా చెప్పకపోవడంతో ఆమె నొచ్చుకున్నారని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.

అయితే టాక్సిక్ మూవీ నుంచి ఓ స్టార్ తప్పుకోవడం ఇది రెండోసారి. ఇప్పటికే యశ్ సరసన హీరోయిన్‌గా ఎంపికైన తృప్తి దిమ్రీ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడంతో ఆమె స్థానంలో కియారా అద్వానీని తీసుకున్నారు. నయనతారా - మేకర్స్ మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి రావడంతో లేడీ సూపర్‌స్టార్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరీనా తప్పుకున్నప్పటికీ.. నయన్ ఆ రోల్ పోషిస్తుండటంతో సినిమాపై బజ్ నెలకొంది. నయనతార .. జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ జనాలకు కూడా పరిచయం కావడంతో కరీనా లేని లోటును భర్తీ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇకపోతే.. రణబీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''రామాయణ''లో యశ్ రావణాసురుడి పాత్రను పోషించనున్నారు. ఇందుకోసం యశ్ భారీ కసరత్తులు చేస్తున్నారు. రావణుడి రూపం , ఆహార్యంతో పాటు భారీకాయంతో కనిపించేందుకు దాదాపు 20 కేజీలు బరువు పెరగనున్నారు. అంతేకాదు .. రామాయణలో యశ్ నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరిస్తుండటం విశేషం. మరి రావణాసురుడిగా యశ్ ఎలా మెప్పిస్తారో చూడాలి. రామాయణలో రాముడుగా నటిస్తోన్న రణబీర్ కపూర్, సీత క్యారెక్టర్ చేస్తోన్న సాయిపల్లవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X