twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబాయ్ పిలవలేదా..!? అబ్బాయే రాలేదా!? నందమూరి ఫ్యామిలీ గొడవలు ఇంత తీవ్రంగా ఉన్నాయా!?

    నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఎవ్వరూ గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ కు హాజరు కాలేదు.

    |

    నంద‌మూరి ఫ్యామిలీలో బాల‌కృష్ణ కుటుంబానికి హ‌రికృష్ణ కుటుంబానికి కాస్త గ్యాప్ ఉంద‌న్న వార్త‌లు, పుకార్లు, షికార్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఈ గ్యాప్ రోజు రోజుకు పెద్ద‌ద‌వుతూ రాగా...ఇక 2019 ఎన్నిక‌ల దృష్ట్యా వీరంతా ఒక్క‌తాటిపైకి వ‌స్తార‌న్న చ‌ర్చ‌లు సైతం స్టార్ట్ అయ్యాయి. చంద్ర‌బాబు ఈ రెండు ఫ్యామిలీల‌ను క‌లుపుతార‌న్న ప్ర‌చారం కూడా జరిగింది.

    సోమవారం సాయంత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం డిజిటల్ ఇన్విటేషన్‌ను తయారుచేయించి మరీ.. వందమంది విశిష్ట అతిథులకు అందించింది డైరెక్టర్ క్రిష్ బృందం. ఆ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు. కానీ, నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఎవ్వరూ ఈ వేడుకకు హాజరు కాలేదు. మరి వారి గైర్హాజరు వెనక కారణమేంటంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.ఈ వివాదాల కథపై చిన్న రిపోర్ట్

     నాన్న‌కు ప్రేమ‌తో:

    నాన్న‌కు ప్రేమ‌తో:

    జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `నాన్న‌కు ప్రేమ‌తో` సినిమా విడుద‌ల రోజుల్లో ఆ సినిమాను ఎలాగైనా అడ్డుకోవాల‌ని ప్రయత్నించారనీ. సినిమాను రిలీజ్ చేయ‌నివ్వ‌కుండా కొంద‌రు చిత్ర నిర్మాత‌పై కేసులు కూడా పెట్టించారనీ వార్తలు వచ్చాయి. ఇన్ని అడ్డంకుల మ‌ధ్య రిలీజ్ అయిన నాన్న‌కు ప్రేమ‌తో మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ట్ కొట్టింది.

     సొంత జిల్లాలోనే:

    సొంత జిల్లాలోనే:


    అదే త‌ర‌హాలో మళ్ళీ తార‌క్ సినిమా `జ‌న‌తా గ్యారేజ్`సమయం లో కూడా. సినిమా బెన్‌ఫిట్ షోను అడ్డుకునేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించారు. నందమూరి తారక రామారావు సొంత జిల్లాలోనే జూ.ఎన్టీఆర్ సినిమాకు బ్రేకులు వేయాలని చూడటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    హెచ్చరించారు:

    హెచ్చరించారు:

    బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరిస్తే మచిలీపట్నం కలెక్టరేట్, విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయాల వద్ద ధర్నాకు దిగుతామంటూ జూనియర్ అభిమానులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులను కలిసి హెచ్చరించారు. సినిమా బెనిఫిట్ షో అనుమతి నిరాకరణ వెనుక టీడీపీ పెద్దల ప్రమేయం ఉండటంతో మంత్రులు సైతం మౌనముద్ర దాల్చినట్టు చెప్పుకున్నారు.
     నిజం ఎంతో :

    నిజం ఎంతో :


    ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ వాళ్ళ అనుమానమూ నిజమేనేమో నన్న నమ్మకమూ పెరిగి పోయింది. చివ‌ర‌కు చంద్రబాబు వద్దకే ఈ పంచాయితీ వెళ్లింది. జూనియర్ సినిమాను అడ్డుకుంటే బాల‌కృష్ణ‌, నారా లోకేష్‌లు కావాల‌ని చేశార‌ని ప్ర‌జ‌లు అనుకుంటార‌ని, ఇది మంచిది కాదని సొంత సామాజికవర్గానికి చెందిన పలువురు చెప్పినట్లు సమాచారం. కావాల‌ని తార‌క్ రెండో సినిమాను అడ్డుకుంటే తార‌క్ అభిమానులు గొడ‌వ‌ల‌కు దిగుతార‌నే నేప‌థ్యంలో బెన్‌షిట్ షోల‌కు అనుమ‌తులిచ్చారు.

    టీవీ లైవ్ ద్వారా:

    టీవీ లైవ్ ద్వారా:

    2009 ఎన్నికల్లో ఇదే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తరపున అప్పట్లో రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేశారు. కారు ప్రమాదంలో దెబ్బతిని రెస్ట్ తీసుకునే సమయంలో కూడా బెడ్ మీద ఉండి కూడా టీవీ లైవ్ ద్వారా తెలుగుదేశం కోసం ప్రచారం నిర్వహించారు. కానీ 2014 ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది.
     రాజకీయ విభేదాల కారణంగానే:

    రాజకీయ విభేదాల కారణంగానే:


    2009లో ఇదే నాయుకులు జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టుకుని..ప్రచారం కోసం పరితపించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన అమరావతి శంకుస్థాపనకు మొత్తం లక్షన్నరకు పైగా కార్డులు పంచినా అందులో జూనియర్ ఎన్టీఆర్ కు కార్డు పంపలేదని చెబుతున్నారు. రాజకీయ విభేదాల కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ చేసిన పలు సినిమాలు బాగున్నా కూడా తెలుగుదేశం శ్రేణులే నెగిటివ్ ప్రచారం చేసి దెబ్బకొట్టారని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి

     కొద్దిరోజుల క్రితం:

    కొద్దిరోజుల క్రితం:


    కారణంగా తారక్ సినీ జీవితం ఇబ్బందుల్లో పడబోతోందని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. జూనియర్ కొత్త సినిమా నాన్నకు ప్రేమతోన తొక్కేయడానికి బాలయ్య టీమ్ సిద్దమవుతోందని కూడా పుకార్లు షికార్లు చేశాయి. బాలయ్య డిక్టేటర్, జూనియర్ నాన్నకు ప్రేమతో రెండూ ఒకే సమయంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండటం కూడా ఈ స్పర్థలకు మరింత ఆజ్యం పోసింది.

     బాలయ్యకు ఫోన్ చేసి క్షమాపణలు:

    బాలయ్యకు ఫోన్ చేసి క్షమాపణలు:


    అయితే ఈ విబేధాల వల్ల నష్టాలే తప్ప లాభం లేదని భావించిన ఓ నటుడు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లకు రాజీ కుదిర్చినట్టు ఆ మధ్య ఓ పత్రిక రాసింది. జూనియర్ స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్టు రాసింది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కుదిరిన రాజీ ప్రకారం.. ఎన్టీఆర్ కొత్త సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యే అవకాశం ఉందని కూడా ఆ పత్రిక రాసింది.

     బాబాయ్.. అబ్బాయ్:

    బాబాయ్.. అబ్బాయ్:


    బాలయ్య గట్టిగా మాట ఇవ్వకపోయినా సానుకూలంగానే స్పందించినట్టు తెలిపింది. దీన్ని బట్టి నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ కు బాలకృష్ణ హాజరవుతాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అభిమానుల ఆశలు నెరవేరలేదు. బాబాయ్.. అబ్బాయ్ లను ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు.

     బాబాయ్.. అబ్బాయ్:

    బాబాయ్.. అబ్బాయ్:


    బాలయ్య గట్టిగా మాట ఇవ్వకపోయినా సానుకూలంగానే స్పందించినట్టు తెలిపింది. దీన్ని బట్టి నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ కు బాలకృష్ణ హాజరవుతాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అభిమానుల ఆశలు నెరవేరలేదు. బాబాయ్.. అబ్బాయ్ లను ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు.

     స్పందించారు:

    స్పందించారు:


    అయితే చాలాకాలంగా బాబాయ్ సినిమాల విషయంలో రియాక్ట్ కాని అబ్బాయిలు కూడా ఇప్పుడు స్పందించారు. ట్రైల‌ర్ రిలీజ్ అయిన గంట‌లోనే ట్రైల‌ర్ అదిరిపోయిందంటూ వీరిద్ద‌రు ట్వీట్ చేశారు. బాలకృష్ణను గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా చూపించిన దర్శకుడు క్రిష్ కు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు యంగ్ టైగర్.

     అంతా ఊహించినట్టే:

    అంతా ఊహించినట్టే:


    అయినా బాలకృష్ణమాత్రం ఈ సంగతి పట్టించుకున్నట్టు కనపడలేదు. కనీసం ఆ ట్వీట్లకు తన రియాక్షన్ కూడా చెప్పలేదు. దాంతో ఇద్దరి మధ్యా ఉన్న విభేదాలు అలాగే ఉన్నాయని అర్థమౌతోందంటూ చెప్పుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీ జనాలు, అభిమానులు. అంతా ఊహించినట్టే గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో జూనియర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ కనిపించలేదు.

     గౌతమిపుత్ర శాతకర్ణి :

    గౌతమిపుత్ర శాతకర్ణి :


    సోమవారం సాయంత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం డిజిటల్ ఇన్విటేషన్‌ను తయారుచేయించి మరీ.. వందమంది విశిష్ట అతిథులకు అందించింది డైరెక్టర్ క్రిష్ బృందం. ఆ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు.

    గైర్హాజరు వెనక కారణం:

    గైర్హాజరు వెనక కారణం:


    కానీ, నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఎవ్వరూ ఈ వేడుకకు హాజరు కాలేదు. మరి వారి గైర్హాజరు వెనక కారణమేంటంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. వారి రెండు ఫ్యామిలీల మధ్య చెడిందేమోనని మాట్లాడుకుంటున్నారు.

     ఎందుకు రాలేదు?:

    ఎందుకు రాలేదు?:


    శాతకర్ణి టీం వారికి ఆహ్వానాలు అందజేయలేదా? ఇచ్చినా వారే హాజరు కాలేదా? వారికి రావడం కుదర్లేదా? మొన్న జరిగిన నందమూరి జానకిరామ్ తనయుల నూతన పట్టు వస్త్రాలంకరణ ఫంక్షన్‌కు హాజరైన వారు.. ఈ ఆడియో వేడుకకు ఎందుకు రాలేదు? అన్న ప్రశ్నలతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

     ట్విట్టర్‌లో :

    ట్విట్టర్‌లో :


    గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదలైనప్పుడు.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. శాతకర్ణి అదరహో, శాతకర్ణిగా బాలయ్య అద్భుతంగా ఉన్నాడంటూ పొగిడేశారు. మరి అంత పొగిడిన ఆ నందమూరి హీరోలు ఆడియో వేడుకకు ఎందుకు హాజరు కాలేకపోయినట్టు అన్న సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    If the sources are to be believed, 'Not just NTR, No Invitation was extended to even Kalyan Ram who remained neutral all these days. So, The chances of Nandamuri Brothers gracing the music launch look bleak for now'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X