ఎన్టీఆర్ హడావిడి అందుకా?

అయితే యువగర్జన హిట్ టాక్ తెచ్చుకోవటంతో ఆ వార్తకు పెద్ద ప్రయారిటీ లేకుండా పోయింది. ఎన్టీఆర్ లేకుండానే...చివరకు గెస్ట్ గా కూడా లేకుండా హిట్ కొట్టామని కొందరు చంకలు గుద్దుకున్నారని వినిపించాయి. అయితే ఇటువంటి కాంట్రావర్శీలకు సమాధానంగా ఎన్టీఆర్ ఆ రోజు షూటింగ్ అర్జెంటుగా జరిపారని చెప్తున్నారు. అలాగే షూటింగ్ విజువల్స్ అర్జెంటుగా మీడియా అందచేసారు. అంటే తను మీటింగ్ కి వెళ్ళకపోవటానికి కారణం కేవలం షూటింగే నని నమ్మించటానికి చేస్తున్న ప్రయత్నం అని మీడియాలో,ఫిల్మ్ సర్కిల్స్ లో అంటున్నారు. అంతేగాక ఇలాంటి రాజకీయపరమైన ఆలోచనలు కూడా చంద్రబాబే చెప్తూంటారని ఆయన మీదకు తోసేస్తున్నారు.


Click it and Unblock the Notifications











