twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ కి ‘ఊసరవెల్లి’ టైటిల్ ఎందుకంటే...!?

    By Sindhu
    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఊసరవెల్లి" సినిమాకు ఆ టైటిల్ నిర్ధారింఛినప్పటి నుంచి సర్వత్ర ఆసక్తి నెలకొంది. అటు యంగ్ టైగర్ అభిమానులు, ఇటు సినిమా విశ్లేషకులు దీనిపై పలు ఊహాగానాలు చేసారు. ఈ సినిమాలోని ఎన్టీఆర్ పాత్ర లో ప్రతికూల షేడ్స్ ఉన్నాయా..? లేదా, అతను పరిస్థితులు కనుగుణంగా మారిపోతాడా.. ? అనేది అందరి మదిని తొలిచివేసింది.

    అయితే, దీనిపై స్వయానా ఎన్టీఆర్ నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు. నిజమే," తెలుగు సంస్కృతిలో ఊసరవెల్లి అనేది సానుకూల పేరు కాదు. సాధారణంగా మనం ఈ పేరును జిత్తులమారి, చంచల మనస్తత్వం గల వ్యక్తులకు వాడతాం. అయితే ఈ చిత్రంలో సురేందర్ రెడ్డి ఇచ్చిన నిర్వచనం ఏమంటే, ఒక వ్యక్తి అతని స్నేహితులు, ప్రియమైన వారిని ఆపదనుంచి బయట పడైటం కోసం తన స్వభావాన్ని ఏ విధంగా మార్చుకున్నాడో వివరిస్తుంది. ఈ చిత్రం తర్వాత మనం ఊసరవెల్లిని కొత్త అభిప్రాయంతో చూస్తాం".

    అంతే కాదు.. ఈ డైనమిక్ యాక్టర్ దీని గురించి ఏమన్నారంటే," ఇది రంగులు మార్చే ఊసరవెల్లి కాదు, రాతలు మార్చే ఊసరవెల్లి". ఏమైతేనేం, ఈ సినిమా స్మాషింగ్ బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ అయితే, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ దసరాకు, దూకుడు.. ఊసరవెల్లి.. రూపంలో డబుల్ ధమాకా సంబరాలు జరుపుకుంటుంది. విజయదశమి సెంటిమెంట్ ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరోసారి హిట్ కొట్టడమే కాక ఇండస్ట్రీ రికార్డులన్నింటిని తిరగరాస్తాడని నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1800 థియేటర్లకి పైగా విడుదలవుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ చిత్రానికి, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత.

    English summary
    Ever since Oosaravelli has been confirmed as the title for Young Tiger NTR’s action extravaganza, fans and cinema analysts alike were curious about the choice of title. Does NTR’s character have negative shades in the film? Or is it because he changes mannerisms to face the situations surrounding him?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X