»   » హీరో యిన్ల కష్టాలు.., ఫ్యాన్స్ కి భయపడి రెస్టారెంట్లో దాక్కుని... ఆ పై సెక్యురిటీ సాయంతో...

హీరో యిన్ల కష్టాలు.., ఫ్యాన్స్ కి భయపడి రెస్టారెంట్లో దాక్కుని... ఆ పై సెక్యురిటీ సాయంతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటులంటే అభిమానం ఉండటం సహజమే.. అందులోనూ హీరోయిన్లంటే కాస్త ప్రత్యేక అభిమానం కదా.వాళ్ళు కనిపించినప్పుడు ఒక ఆటోగ్రాఫ్ లేదంటే ఒక సెల్ఫీ తీసుకోవాలనిపించటమూ సహజమే... కానీ ఆ అభిమానమే హద్దులు దాటితే... చాలా ఇబ్బందులనే ఎదుర్కోవలసి వస్తుంది. షాపింగ్ మాల్ ప్రారంభొత్సవమనో, మరే ఇనాగరేషన్ కోసమో వచ్చిన హీరోయిన్ల పై సెల్ఫీల కోసం ఎగబడటమూ...

సందట్లో సడేమియా గా వారి శరీరాలని చెప్పుకోలేని చోట తాకేందుకు ప్రయత్నించి శునకానందం పొందటమూ చేసే బ్యాచ్ కూడా ఉంటారు. కేవక్లం ఏదో కార్యక్రమానికి వెళ్ళినప్పుడే కాదు మామూలుగా వాళ్ళు అయిర్ పోర్టుల్లో కనబడ్డప్పుడూ, వారి పరివేట్ లైఫ్ లో భాగం గా రెస్టారెంతలకో, రిసార్టులకో వెళ్ళినప్పుదు కూడా ఈ అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.

Why Parineeti Chopra had to HIDE inside a restaurant ?

బాలీవుడ్ హీరోయిన్ పరిణతి చోప్రాకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆదివారం గోవా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఈ ముద్దుగుమ్మను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కానీ అంతటితో ఆగలేదు. ఆమెను పట్టుకోవాలని, కరచాలనం చేయాలని చాలామంది ప్రయత్నించారు. ఈ సందర్భంలో తోపులాట జరిగింది. ఆమె ఆ ఉక్కిరిబిక్కిరి పరిస్థితిని తట్టుకోలేక సైలెంట్‌గా సైడ్ అయిపోయి రెస్టారెంట్‌లో దాక్కోవాల్సి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత సీఐఎస్‌ఎఫ్ సాయంతో ఆమె ఆ గందరగోళం నుంచి బయటపడింది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేకపోతే ఇబ్బందులు ఉంటాయో, లేవో తెలియదు కానీ అతి అభిమానం మాత్రం చాలా ప్రమాదకరమని పరిణతికి ఈ సంఘటనతో తెలిసొచ్చినట్టే ఉంది.

English summary
When people got to know that Parineeti in at the Airport, then people came to her. Slowly crowd was increased. Some were asking for her autograph and some were asking for the selfie. Here crowd was getting increased. There was a time when the crowd was getting out of control. Parineeti got afraid with this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu