twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ఇక కొత్త సినిమాలు ఒప్పుకోడు: ఇదే సాక్ష్యం

    ఫొటోలో పవన్‌కళ్యాణ్‌తో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్టీవెన్‌ జార్డింగ్‌. రెండు గంటలపాటు వీరిద్దరి మధ్యా సమావేశం జరిగిందని జనసేన పార్టీ చెబుతోంది.

    |

    హార్వార్డ్‌ యూనివర్సిటీ విద్యార్థుల సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకి వెళ్ళిన పవన్‌, ఆ యూనివర్సిటీలో ప్రసంగించనున్న విషయం విదితమే. కాగా, అమెరికా పర్యటనలో పవన్‌కళ్యాణ్‌ రాజకీయ కార్యకలాపాల్నీ చక్కబెట్టేస్తున్నారు. ఫొటోలో పవన్‌కళ్యాణ్‌తో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్టీవెన్‌ జార్డింగ్‌. రెండు గంటలపాటు వీరిద్దరి మధ్యా సమావేశం జరిగిందని జనసేన పార్టీ చెబుతోంది.

    ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రొఫెసర్‌ స్టీవెన్‌ జార్డింగ్‌తో రెండు గంటలు పవన్ ఏకాంతంగా సమావేశమయ్యారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కి ప్రొఫెసర్‌ స్టీవెన్‌ సలహాలు ఇస్తుంటారని జనసేన తెలిపింది. ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు, సెనేటర్లు, అమెరికా న్యూక్లియర్‌ పాలసీ రూపకర్తలతో పవన్ భేటీకానున్నారని జనసేన సోషల్ మీడియా ప్రకటించింది. ఎన్నారైలు ఏర్పాటు చేసిన విందులో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు చెబుతూనే ఉన్నాయి.

    Why Pawan Kalyan Meets Harvard Professor Steve Jarding

    ప్రస్తుతం ఎన్నికల బరిలో దిగుతున్న అఖిలేష్‌కు రాజకీయ సలహాదారుగా ఉన్న జార్డింగ్‌.. ఎన్నికల వ్యూహా రచనలో దిట్ట. ప్రస్తుతం ఈయన హార్వార్డ్‌ విశ్వవిద్యాలంయలోని కెన్నడీ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయనతో పవన్‌ ఉన్న ఈ ఫోటోలను జనసేన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 2019 ఎన్నికల గురించి పవన్‌కు జార్డింగ్‌ వివరించినట్టుగా కూడా తెలియజేశారు. రాజకీయ నాయకుడిగా పక్కన పెడితే టాలీవుడ్ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ లో ప్రసంగం చేయనున్న తొలి నటుడు పవన్ కల్యాణే.

    నేడు పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవెన్ జార్డింగ్ తో పవన్ ఏకాంతంగా దాదాపు రెండుగంటల పాటు సమావేశమై పలు విషయాలు ఆయనతో చర్చించారు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే శాసనసభ ఎన్నికల్లో పవన్‌ పార్టీ పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదంతా చూస్తూంటే ఇప్పటికే ఎటూ తేలని సినిమాలే మూడున్నాయి.

    కాటమరాయుడు పూర్తవగానే కష్టం మీద ఇంకో రెండు సినిమాలు చేసేచాన్స్ ఉంది అదీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్కాగా చెప్పటం అనుమానమే అంటే ఇక పవర్ స్టార్ చేయబోయేవి మరో రెండు సినిమాలు మాత్రమే అన్న మాట రాజకీయాలంటే ఎలక్షన్లూ, గెలుపూ ఓటములూ కాదు అనే పవన్ తనదైన క్లారిటీ తో నే ముందస్తు ప్రణాలికలు రచించుకుంటున్నాడు. ఖచ్చితంగా 2019 కల్లా ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రతిపక్షంగా జనసేన అవతరించనుందన్నమాట..

    English summary
    Power star Pawan Kalyan has met Prof. Steve Jarding who is a professor at Harvard University, Lecturer in Public Policy, an American and international educator, lecturer, writer and political consultant. Pictures of the Gabbar Singh star discussions with the professor are now going viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X