twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "కాటన్"రాయుడు వెనక కథ: మాటకోసం ఆచరణ లో పవన్

    కాటమరాయుడు పూర్తి స్థాయి సినిమా కేవలం పంచెకట్టు మీదనే చూపించాడు. అయితే ఈ లుంగీ లుక్ వెనక ఉన్న కథ వేరే ఉంది అదేమిటంటే

    |

    ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ అంటే నే స్తైల్ కి ఒక ఐకాన్ బద్రి టైం నుంచీ మొన్న మొన్నటి అత్థారింటికి దారేది వరకూ పవన్ దుస్తుల్లో రకరకాల వేరియేషన్లు చూపించాడు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి సినిమా కేవలం పంచెకట్టు మీదనే చూపించాడు. సరే రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథకాబట్టి పంచెకట్టు అనుకోవాలనుకున్నా... ఇంతకు ముందు వచ్చిన సీమ బ్యాక్డ్రాప్ కథల్లో కూడా హీరోలు అప్పుడప్పుడూ పంచెకట్టటం తప్ప మొత్తం సినిమా అంతా లుంగీ మీదే ఉండలేదు. అయితే ఈ లుంగీ లుక్ వెనక ఉన్న కథ వేరే ఉంది అదేమిటంటే....

    రకరకాల వేరియేషన్లు

    రకరకాల వేరియేషన్లు

    బద్రి టైం నుంచీ మొన్న మొన్నటి అత్థారింటికి దారేది వరకూ పవన్ దుస్తుల్లో రకరకాల వేరియేషన్లు చూపించాడు. కానీ పవన్ మాత్రం సినిమా మొదలైన దగ్గరినుంచీ చివరి దాకా కాటన్ దుస్తులకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇంకో గమనించ దగ్గ అంసం ఏమిటనటే ఆన్ స్క్రీన్ లోనే కాదు బయట జరిగిన ఫంక్షన్లలో కూడా కాటన్ దుస్తులకే ప్రాధాన్యతనిచ్చాడు.

    డిజైనర్ దుస్తులను కూడా కాటన్‌తోనే

    డిజైనర్ దుస్తులను కూడా కాటన్‌తోనే

    ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకొకటుంది. పంచెకట్టే కాదు.. డిజైనర్ దుస్తులను కూడా కాటన్‌తోనే తయారు చేయించారు. ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్, ఆడియో అన్నింట్లోనూ పవన్ వేసుకున్న దుస్తులు కాటన్ వే అయి ఉండేటట్టు చూసుకున్నారు. ఇక, రీసెంట్‌గా జరిగిన ప్రి రిలీజ్ ఫంక్షన్లో అయితే.. పంచెకట్టు హంగామా మామూలుగా లేదు.

    పూర్తిగా పంచెకట్టు లోనే

    పూర్తిగా పంచెకట్టు లోనే

    పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఏ హీరో రానట్టు గా పూర్తిగా పంచెకట్టు లోనే కార్యక్రమానికి వచ్చేశాడు. ఇక ఆ కాటన్ రాయుడు గెటప్ పవన్ ఒక్కడిద్దే అయితే సినిమా ప్రమోషన్‌కు అలా చేస్తున్నాడేమో అనుకోవచ్చు గానీ, సినిమా యూనిట్లో దాదాపు అందరూ పంచెకట్టులోనే సందడి చేశారు.

    నేతన్నలకు అండగా ఉంటానని

    నేతన్నలకు అండగా ఉంటానని

    ఔను మీరు ఊహించింది నిజమే ఇటీవలే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని, నేతన్నలకు అండగా ఉంటానని పవన్ ప్రకటించాడు. అందుకే ఆ మార్పు తనతోనే మొదలు పెట్టాడు అప్పట్నుంచి పంచెకట్టులోనే కనిపిస్తున్నాడు మన కాటమ రాయుడు. నేత కళాకారులను కలిసే ఏ చిన్న అవకాశాన్నీ వదులు కోవటం లేదు,

     చేతలతోనే చెబుతున్నాడు

    చేతలతోనే చెబుతున్నాడు

    మాట చెప్పిన దానికన్నా ఆ మాట మీద నిలబడటం లోనే ఎక్కువ శ్రద్ద చూపిస్తాను అని తన చేతలతోనే చెబుతున్నాడు జన సేనాని. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా కాటన్ దుస్తుల్లోనే మెరిసిపోతున్నాడు కాటమరాయుడు. అటు ఫ్యాన్స్ సమక్షంలోనూ, ఇటు పబ్లిక్ సమక్షంలోనూ కాటన్ దుస్తులను ధరించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

    ఇప్పుడు ఇదే ట్రెండ్

    ఇప్పుడు ఇదే ట్రెండ్

    ఎందుకంటే పవన్ తన అభిప్రాయాలని బలవంతంగా రుద్దే ప్రయత్నమ్న్ చేయడు తాను ఆచరించటం చూసి తనను అభిమానించే వారూ ఇదే పద్దతిలోకి మారతారని ఇలా తనే ముందు మొదలు పెట్టాడట. నిజమే ఇప్పుడు ఇదే ట్రెండ్ పవన్ ఫ్యాన్స్ స్టార్ట్ చేస్తే గనక కాటన్ వాడకం లో ఖచ్చితంగా ఒక ఆకర్షణ పెరుగుతుంది. ఇది చేనేత వృత్తి కారులకి మేలు చేసే అంశమే కదా... ఈ విషయం లో పవన్ కి ఒక హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే...

    English summary
    The Secrete Revealed behind Pawans look in Katamarayudu in full of Cotton costumes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X