పవన్ కళ్యాణ్ ఎందుకు తెలంగాణ యాస మాట్లాడతాడు?
పులి చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర అడపా దడపా తెలంగాణ యాస మాట్లాడుతుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అని మీడియా వారు తాజాగా దర్శకుడు ఎస్.జె.సూర్య ని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానంగా..."నా హోమ్‌టౌన్ తిరునల్వేలి. విదేశాలు వెళ్లినప్పుడు నేనెంత మోడర్న్‌గా మాట్లాడటానికి ట్రై చేసినా నాకు తెలియకుండా ఒక్కోసారి మా తిరునల్వేలి స్లాంగ్ వచ్చేస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, పీకే నాయక్ తండాకి చెందిన వ్యక్తి. అతను ఎంత పెద్ద పోలీస్ అధికారి అయినప్పటికీ అతనికి తెలియకుండానే తెలంగాణ యాస వచ్చేస్తుంది' అని విశ్లేషించి చెప్పుకొచ్చారు.
అలాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగాలు ఇస్తుంటారు. అన్ని లెంగ్తీ డైలాగ్‌లు ఎందుకు పెట్టారు? అనే ప్రశ్నను సూర్య ముందుంచితే -"ఏసు ప్రభువు, కృష్ణుడులాంటి దేవుళ్లు, అన్నాదురై, మహాత్మాగాంధీలాంటి మహానుభావులు సమాజాన్ని బాగు చేయడం కోసం సుదీర్ఘ ప్రసంగాలు ఇస్తే మనం విన్నాం. ఈ దేవుళ్లు, మహానుభావాలు కలిపితే 'పులి'. సమాజంలో మార్పు తేవడం కోసం పులి ప్రసంగిస్తాడు. ఆ మాటలు కనీసం ఒక్క వ్యక్తిలో అయినా మార్పు తీసుకొస్తే చాలు.. మేం పడిన కష్టానికి ఓ అర్థం లభించినట్లే' అన్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











