»   »  నితిన్ వెనుక పవర్ పాలిటిక్స్...!?

నితిన్ వెనుక పవర్ పాలిటిక్స్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ కి పెద్దగా లౌక్యం తెలియదు ఆలోచించి,ఆచితూచీ వ్యూహాత్మకంగా వ్యవహరించటం తెలియని అమాయకుడు అనుకునేవాళ్ళు. అయితే కాలం తో పాటు పవన్ కూడా మారిపోతున్నాడా..? రాజకీయాల్లోకి వస్తూనే తానూ లౌక్యంగా వ్యవహరించటం నేర్చుకున్నాడా..? గత కొన్ని రోజులుగా పవన్ వేస్తున్న అడుగులని గమనిస్తే ఆయన లో వచ్చిన మార్పు స్పష్టంగానే కనిపిస్తుందంటూ టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు........

ఇంతకూ ఆ వార్తేమిటంటే...! మెగా హీరోలంతా చిరంజీవి 150వ సినిమా ప్రారంభానికి వస్తే ఆ ప్రోగ్రాం కి డుమ్మా కొట్టిన పవన్ 'అ ఆ' ఆడియో వేడుకకు అతిధిగా రావడానికి అంగీకరించిన విషయం తెలుసుకొని చాల మంది ఆశ్చర్య పోయారు. అసలు మామూలుగానే ఇలాంటి ఫంక్షన్లకు దూరంగా ఉండే పవర్ స్టార్.. ఈ మధ్య తరచూ నితిన్ ని కలవటం చాలా మందికి మింగుడు పడలేదు.....

ఈ వ్యవహారం వెనుక అసలు విషయం ఏమిటి అన్న విషయం లో ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. పవన్ 'అ ఆ' ఆడియో వేడుకకు అతిధిగా రావడానికి అంగీకరించింది తన క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ కోసమో లేదంటే తమ్ముడు నితిన్ కోసమో కాదు అంటున్నారు.

Why Pawan meets Nitin regulerly..?

నిజానికి "సర్దార్" వల్ల పవన్ భారీగానే దెబ్డ తిన్నాడు. ఈ సినిమా వల్ల బయ్యర్లు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే .. ముఖ్యంగా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి 8 కోట్ల వరకు నష్టం వచ్చిందన్న వార్త కూడా వినిపిస్తోంది. మొత్తానికి సర్దార్ దెబ్బ గట్గిగానే తగిలింది.ఇప్పుడు ఎస్.జె. సూర్య దర్శకత్వంలో లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా పై 'సర్దార్' నష్టాల ప్రభావం ఉంటుంది కాబట్టి రేట్లు తగ్గించి ఈ కొత్త సినిమా రైట్స్ ఇచ్చినా... ఇంకా చిక్కులు తగ్గలేదు....

ఈ పరిస్థితులలో డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి ఒక పెద్ద వ్యక్తి మద్దతు అవసరమని భావించిన పవన్ తన కొత్త సినిమాకు సుధాకర రెడ్డి చేత క్లాప్ కొట్టిoచడమే కాకుండా అతడి కొడుకు నితిన్ 'అ ఆ' ఆడియో ఫంక్షన్ కు అతిధిగా వెళ్ళి ఆ సినిమా ప్రమోషన్ కు తన వంతు సహకారం చేస్తున్నాడని టాక్. చివరికి పవన్ కి రాజకీయాలు పట్టుబడ్డాయన్న మాట....

English summary
power star pawan kalyan is meeting regularly with Nitin because of business deal between them
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu