రెండో పెళ్లి వార్తలపై... అయోమయం క్రియేట్ చేసిన సింగర్ సునీత!

By Bojja Kumar

Recommended Video

నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారికి థాంక్స్..సింగర్ సునీత.

ప్రముఖ తెలుగు సింగర్ సునీత గురించి రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. 40 ఏళ్ల ఈ సింగర్ త్వరలో రెండో పెళ్లికి సిద్ధమవుతోందంటూ ఆ వార్తల సారాంశం. ప్రముఖ పత్రికలకు చెందిన వెబ్ సైట్లలో సైతం ఈ రూమర్స్ గురించి వార్తలు రావడంతో తన ఫేస్ బుక్ పేజీ ద్వారా సునీత స్పందించారు. అయితే ఆమె స్పందించిన తీరు అభిమానులను మరింత అయోమయంలోకి పడేయడం గమనార్హం.

ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఎంతుకంత ఆసక్తి?

ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఎంతుకంత ఆసక్తి?

తన రెండో పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై సింగర్ సునీత స్పందిస్తూ... ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మీకు ఎందుకంత ఆసక్తి? అంటూ ఫేస్‌బుక్ పేజీలో స్టేటస్ పెట్టారు.

ఇంతకీ రెండో పెళ్లి నిజమా? కాదా?

ఇంతకీ రెండో పెళ్లి నిజమా? కాదా?

తన పెళ్లి గురించి వస్తున్న వార్తను సునీత ఖండించడం కానీ, సమర్దించడం కానీ చేయలేదు. నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? అనే విధంగా రియాక్ట్ అయ్యారు. దీంతో ఆ వార్తలు నిజమా? కాదో తెలియక అభిమానులు అయోమయంలో పడ్డారు.

19వ ఏటనే వివాహం

19వ ఏటనే వివాహం

సునీతకు 19వ ఏటనే కిరణ్ అనే వ్యక్తితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు. 20 ఏళ్ల కుమారుడు ఆకాష్, 17 ఏళ్ల కుమార్తె శ్రేయ ఉన్నారు. శ్రేయ పుట్టిన కొన్ని రోజులకే సునీత-కిరణ్ విడిపోయారు. తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా తన పిల్లలే ప్రపంచంగా సింగర్ గా కెరీర్ కొనసాగిస్తూ ఆమె జీవిస్తున్నారు.

 తెలుగులో పాపులర్ సెలబ్రిటీ

తెలుగులో పాపులర్ సెలబ్రిటీ

సింగర్‌గా కెరీర్ మొదలు పెట్టిన సునీత టాలీవుడ్లో ప్రముఖ గాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా అనేక మంది హీరోయిన్లకు ఆమె వాయిస్ ఓవర్ ఇచ్చారు. తన టాలెంటుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాంటి సెలబ్రిటీ వ్యక్తిగత జీవితంపై అభిమానుల్లో ఆసక్తి ఉండటం సహజమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X