twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలకి ఓటు వెయ్యకండి, అది నా దేశానికి ఓ విపత్తులాంటిదే : ప్రకాశ్ రాజ్

    రజనీకాంత్.. కమల్ హాసన్ తో పాటు కన్నడ నటుడు ఉపేంద్రలు పార్టీ పెట్టి తమకు ఓట్లు వేయాలని అడిగితే వారికి ఓటు వేయద్దని తాను ప్రచారం చేస్తానని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు.

    |

    Recommended Video

    I Will Not Vote For Them : Prakash Raju Says

    కుండ బద్ధలు కొట్టేలా మాట్లాడటంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యవహారమే వేరుగా ఉంటుంది. తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

     దేశానికి ఓ విపత్తులాంటిదే

    దేశానికి ఓ విపత్తులాంటిదే

    సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం నా దేశానికి ఓ విపత్తులాంటిదే అని ప్రకాశ్ రాజ్ అన్నాడు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఈ సందర్భంగా స్పష్టంచేశాడు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన.. ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కొత్త కొత్త వివాదాలకు తెర తీసేలా ఉంటున్నాయి.

    భావ ప్రకటనా స్వాంతంత్య్రం

    భావ ప్రకటనా స్వాంతంత్య్రం

    సమాజంలోని లోటుపాట్లను.. నాయకుల తప్పుల్ని ఎత్తి చూపే హక్కు తనకు ఉందని.. నిర్భయంగా మాట్లాడే భావ ప్రకటనా స్వాంతంత్య్రాన్ని రాజ్యాంగం తనకు కల్పించిందన్నాడు. గతకొన్నాళ్ళుగా ఈ భావప్రకటనా అహక్కుని తాను వాడుతూ దాని ఇంపార్టెన్స్ ని చెబుతూ వస్తున్నాడు కూడా .

    రజనీకాంత్.. కమల్ హాసన్ తో పాటు

    రజనీకాంత్.. కమల్ హాసన్ తో పాటు

    రజనీకాంత్.. కమల్ హాసన్ తో పాటు కన్నడ నటుడు ఉపేంద్రలు పార్టీ పెట్టి తమకు ఓట్లు వేయాలని అడిగితే వారికి ఓటు వేయద్దని తాను ప్రచారం చేస్తానని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. నటులుగా వారిపై ఉండే అభిమానానికి.. రాజకీయానికి వ్యత్యాసం ఉంటుందన్న ఆయన.. సదరు నటుల ఫ్యూచర్ ప్లాన్స్.. వారి ఆత్మస్థైర్యం చూసిన తర్వాత మాత్రమే ఓటు వేయాలన్నారు.

    మోడీ మంచి నటుడు

    మోడీ మంచి నటుడు

    ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడే ప్రకాశ్‌రాజ్ మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశాడు. సినిమా హాల్లో నిలబడి తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని అతను స్పష్టంచేశాడు. గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందిస్తూ.. మోడీ తన కన్నా మంచి నటుడని, ఆయనకు తన అవార్డులు ఇచ్చేస్తానని ప్రకాశ్ అన్న విషయం తెలిసిందే.

    జీఎస్టీ.. గౌరీ లంకేశ్ హత్య అంశాల మీద

    జీఎస్టీ.. గౌరీ లంకేశ్ హత్య అంశాల మీద

    ఓటు వేయటాన్ని తానో బాధ్యతగా భావిస్తానని చెప్పిన ప్రకాశ్ రాజ్..తనను బెదిరించాలనుకునే వారిని అస్సలు లొంగనని.. తనకున్న భావస్వాంత్య్రాన్ని రాజ్యాంగం తనకు కల్పించిందన్నారు. జీఎస్టీ.. గౌరీ లంకేశ్ హత్య తదితర అంశాల మీద తాను మాట్లాడితే ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారని..

     అజెండాలు అస్సలు లేవని

    అజెండాలు అస్సలు లేవని

    ఇలా ముద్ర వేసి హేళన చేసే వారి సంఖ్య ఎక్కువైనట్లుగా చెప్పారు.తనకు జెండాలు.. అజెండాలు అస్సలు లేవని కుండబద్ధలు కొట్టిన ప్రకాశ్ రాజ్.. పార్టీలు పెట్టిన నటులకు తన మాటలతో హోల్ సేల్ గా షాకిచ్చారని చెప్పాలి. రానున్న రోజుల్లో మరెన్ని షాకులు ఇస్తారో చూడాలి .

    English summary
    Prakash Raj has claimed that he has respect for Rajinikanth and Kamal Haasan, but he will not support them in politics till they understand the problems the citizens facing in the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X