పూరీ బ్యాంకాక్ నే ఎందుకు ప్రిఫెర్ చేస్తారంటే..
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఎక్కువగా బ్యాంకాక్ వెళ్తూంటారు...అక్కడే కథల వంటకం చేస్తూంటారు అనే సంగతి తెలిసిందే. అలాగే అక్కడ మసాజ్ లకూ అమ్మాయిలకూ బాగా ప్రసిద్ది అని చెప్తూంటారు. ఈ విషయమై పూరీ జగన్నాధ్ ని బ్యాంకాక్ అంటే మీకు సెంటిమెంటా అని అడిగితే...సెంటిమెంట్ కాదు..కంఫర్ట్. బ్యాంకాక్ బీచ్ లో కూర్చుని హాయిగా కథ రాసుకుంటుంటాను అన్నారు. ఆ పనేదో వైజాగ్ బీచ్ లో కూర్చుని చేయొచ్చుగా అని తిగిగి ప్రశ్నిస్తే...మా నాన్న కూడా అదే అడిగారు. బ్యాంకాక్ లో నన్నెవరూ గుర్తుపట్టరు. హైదరాబాద్ లో ఆఫీసులో కూర్చుని పనిచేసుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకూ జనాలు వస్తూనే ఉంటారు. దాంతో మాటలకే తప్ప, రాతలకు సమయం చిక్కడం లేదు. 'పోకిరి' తరువాత నుంచీ బ్యాంకాక్ వెళుతున్నాను. అక్కడ హాయిగా పని జరుగుతుంది అని సమాధానమిచ్చారు.
పూరీ జగన్నాధ్ పోకిరి గోలీమార్ గోపీచంద్ ఏక్ నిరంజన్ బ్యాంకాక్ bangkok puri jagannath pokiri ek niranjan golimaar


Click it and Unblock the Notifications