సీక్రెట్ రివీల్: ఆ అమ్మాయిల వల్లే రాహుల్ ఇలా చేశాడు.. అనుమానాలపై క్లారిటీ వచ్చేసింది.!

By Manoj

రాహుల్ సిప్లీగంజ్.. తెలుగు రాష్ట్రాల్లోని వాళ్లకు ఈ పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ప్లే బ్యాక్ సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ కుర్రాడు.. గత ఏడాది జరిగిన బిగ్ బాస్ సీజన్ -3 విజేతగా నిలిచాడు. దీంతో అప్పటి నుంచి రాహుల్ పేరు మారుమ్రోగిపోతోంది. ఈ క్రమంలోనే అతడు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి సమయంలో బుధవారం రాత్రి అతడిపై దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ సంచలనం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే దాడి జరిగిన వెంటనే అతడు కేసు పెట్టకపోవడంపై ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

పబ్బులో గొడవ.. రాహుల్‌పై దాడి

పబ్బులో గొడవ.. రాహుల్‌పై దాడి

బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని ఓ పబ్‌కు వెళ్లిన రాహుల్ సిప్లీగంజ్‌పై దాడి జరిగింది. తన స్నేహితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన యువకులను అతడు ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన సదరు యువకులు.. రాహుల్‌పై బీరు బాటిళ్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దాడి తర్వాత కనిపించని రాహుల్

దాడి తర్వాత కనిపించని రాహుల్

దాడి జరిగిన తర్వాత పబ్ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వాళ్లు రంగప్రవేశం చేసి రెండు గ్రూపులను చెదరగొట్టారు. ఆ తర్వాత రాహుల్‌ను అతడి స్నేహితులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స తీసుకున్న తర్వాత అతడు కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో రాహుల్‌కు ఏమైందన్న ఆసక్తి నెలకొంది.

 రాహుల్ తీరుపై అనుమానాలు

రాహుల్ తీరుపై అనుమానాలు

బీరు బాటిళ్లతో దాడి జరిగిన తర్వాత రాహుల్ కనిపించకపోవడానికి తోడు.. అతడు రాత్రి పోలీసులకు సైతం ఫిర్యాదు చేయలేదు. ఈ విషయాన్ని కమీషనర్ స్వయంగా వెల్లడించారు. దీంతో రాహుల్ ఏమైపోయాడు.? దాడి చేసిన వాళ్లపై కేసు ఎందుకు నమోదు చేయలేదు.? ఈ వ్యవహారంలో రాహుల్ తప్పు ఉండడం వల్లే ఇలా చేశాడా.? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సమాధానం దాటవేసిన బిగ్ బాస్ విన్నర్

సమాధానం దాటవేసిన బిగ్ బాస్ విన్నర్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ దాడి వ్యవహారం సంచలనం అవుతోన్న సమయంలో రాహుల్ సిప్లీగంజ్ మీడియా ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే దాడికి ముందు తర్వాత జరిగిన విషయాలన్నీంటిని వెల్లడించాడు. అయితే, రాత్రి కేసు ఎందుకు పెట్టలేదని కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశాడు.

Recommended Video

Rahul Sipligunj Involved In A Brawl | పబ్బులో ఘర్షణ..!! || Filmibeat Telugu
 అప్పుడు కేసు పెట్టలేదు.. ఇప్పుడు ఇలా

అప్పుడు కేసు పెట్టలేదు.. ఇప్పుడు ఇలా

ఎన్నో అనుమానాలకు తావిస్తున్న ఈ వ్యవహారంపై తాజాగా క్లారిటీ వచ్చింది. రాహుల్ స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. తనపై దాడి చేసిన వారిపై అతడు రాత్రే కేసు పెడదామని అనుకున్నాడట. అయితే, దాని వల్ల తనతో ఉన్న అమ్మాయిలు కూడా స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుందన్న ఆలోచనతోనే వెనక్కి తగ్గాడని తెలుస్తోంది. మరోవైపు, రాహుల్ గురువారం ఉదయం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

రాహుల్‌తో ఉన్న అమ్మాయిలు ఎవరు.?

రాహుల్‌తో ఉన్న అమ్మాయిలు ఎవరు.?

దాడి ఘటన బయటకు వచ్చినప్పటి నుంచి రాహుల్‌తో ఉన్న అమ్మాయిలు ఎవరు అన్న ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ విషయంపై తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో క్లారిటీ ఇచ్చాడతను. ‘నాతో ఉన్న అమ్మాయిలు నా స్నేహితులే. వాళ్లు నాకు ఐదారు సంవత్సరాల నుంచి తెలుసు. మేము తరచూ కలుస్తూ ఉంటాం' అని చెప్పాడు. కానీ, అమ్మాయిలెవరో వెల్లడించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X