ప్రభాస్ - రాజమౌళీల సినిమాకెప్పుడు ముహోర్తం...?
క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవని రాజమౌళి టైం విషయంలోనూ కొంచెం జాగ్రత్త పడితే బావుంటుందని సినీ అభిమానులు సలహా ఇస్తున్నారు. ఎప్పుడు ఎటువంటి చిత్రం చేయాలో, ఎలా తీయాలో తెలిసిన రాజమౌళికి ఎంత సమయంలో చుట్టేయాలో అన్నది తెలిస్తే టాలీవుడ్ ఏడాదికి పక్కాగా రెండు సూపర్ హిట్ సినిమాలు ఆశించొచ్చు.
మగధీర" వచ్చిన ఏడాది తర్వాత 'మర్యాద రామన్న" చిత్రాన్ని విడుదల చేసిన రాజమౌళి ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా మొదలు పెట్టే లోపు తక్కువ బడ్జెట్ లో, తక్కువ రోజుల్లో ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తానంటూ 'ఈగ" మొదలుపెట్టాడు. అయితే మర్యాద రామన్న విడుదలై సంవత్సరం దాటినా కానీ ఇంకా 'ఈగ" చిత్రానికి రెక్కలొచ్చిన దాఖలాలు లేవు. నాని హీరోగా, సమంతా హీరోయిన్ గా నటిస్తున ఈ చిత్రం ఇప్పటింకికా షూటింగ్ దశలోనే ఉన్న ఈగ ఎప్పుడు పూర్తవుతుందనేది తెలీదు. రాజమౌళి ఈ చిత్రానికి పనిచేస్తూ తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో నాగార్జున నటిస్తున్న 'రాజన్న" చిత్రానికి యాక్షన్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాడు.
ప్రయోగాత్మకమని మొదలు పెట్టిన ఈగ చిత్రాన్ని కూడా రాజమౌళి తనదైన శైలిలో హై బడ్జెట్ చిత్రంగా మలిచాడు. దాంతో ఇప్పుడా సినిమాని విజయవంతం చేసేందుకు ఎక్స్ ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఈగ ఎప్పుడు పూర్తవుతుందో, ప్రభాస్ సినిమా కథకి ఎప్పుడు ముహూర్తం పెడతాడో...?అది ఎప్పుడు మొదలువుతుందో, ఎప్పటికి విడుదలవుతుందో కూడా ఎవరకీ తెలియదు. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడా పేరు నిలుపుకోవడానికి ప్రతి సినిమానీ అదే పనిగా చెక్కుతూ తనకున్న పేరు జక్కన్నకి న్యాయం చేస్తున్నాడు...


Click it and Unblock the Notifications











