రాజమౌళి ఎందుకు ఇలియానాను హీరోయిన్ గా ట్రీట్ చేయలేదు..?
ఎవరైనా హీరోయిన్ ఫామ్ లో ఉందనిపిస్తే వెంటనే ఆమెకి తన సినిమాలో అవకాశమిచ్చే అలవాటున్న రాజమౌళి ఇంతదాకా ఇలియానాతో మాత్రం సినిమా చేయలేదు. అనుష్కతో విక్రమార్కుడు, కాజల్ తో మగధీర, సమంతతో ఈగ సినిమాలు చేసిన రాజమౌళికి ఇలియానా ఎందుకు నచ్చలేదో అతనికే తెలియాలి. తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకి అంతగా ప్రాధాన్యం లేకపోయినా కానీ సినిమా విజయానికి గ్లామర్ మాత్రం చాలా ముఖ్యమని నమ్మే రాజమౌళికి ఇలియానా గ్లామరస్ గా కనిపించకపోవడం విడ్డూరమే అనాలి.
దాదాపుగా స్టార్ హీరోలంతా ఎగబడి సినిమాలు చేసిన ఇలియానాతో దర్శకుల్లోని స్టార్లు కూడా చాలా మందే పని చేశఆరు. మరి రాజమౌళితో సినిమా చేయకపోయినా తేడా తెలుసుకోలేకపోయిన ఇలియానాకి ఇప్పుడు మాత్రం అతనితో సినిమా చేయడం చాలా అవసరం. ఆమె టాప్ లో ఉన్నప్పుడే పట్టించుకోని రాజమౌళికి ఇలియానా డౌన్ లో ఉన్న ఈ టైమ్ లో ఆమె అవసరం పడుతుందని అనుకోలేం..
More from Filmibeat
rajamouli ileana nenu naa rakshasi shakti jr ntr rana రాజమౌళి ఇలియానా నేను నా రాక్షసి శక్తి జూ ఎన్టీఆర్ రాణా


Click it and Unblock the Notifications











