twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే చిరంజీవి ఇంటికి వెళ్ళాం, చిరంజీవి నాకోసం అడిగారు: ఆరోజు ఘటనని గుర్తు చేసిన రాజశేఖర్

    చిరు గారితో నాకు విభేదాలు వచ్చాక కొన్నేళ్లు దూరంగా ఉండిపోయాను. కానీ ఆ తర్వాత అప్పుడప్పడూ కలుస్తూనే ఉన్నాం. అంటూ మెగాస్టార్ తో తనకే విభేదాలూ లేవని చెప్పాడు రాజశేఖర్

    |

    Recommended Video

    చిరంజీవి ఇంటికి అందుకే వెళ్ళాం..!

    కొన్నేళ్ల కిందట రాజశేఖర్ మీద మెగాస్టార్ అభిమానులు దాడికి ప్రయత్నించటం తో ఇద్దరి మధ్యా దూరం ఏర్పడిందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ సంఘటనలో పాల్గొన్నది చిరు అభిమానులు కాదన్నదీ కొందరి వాదన.. అయితే ఎక్కువమంది నమ్మింది మాత్రం అప్పటి ప్రజారాజ్యం పార్టీమీద విమర్శలు చేసినందుకు మెగా అభిమానులే దాడి చేసారని.

    కోల్డ్ వార్ వాతావరణం

    కోల్డ్ వార్ వాతావరణం

    ఆ ఘటనతో ఒక కోల్డ్ వార్ వాతావరణం రాజశేఖర్, చిరు మధ్యలో చాలాకాలమే ఉండిపోయినా తర్వాత ఇద్దరూ మళ్ళీ కలిసి పోయారు... కానీ ఈ విషయం లో కూడా ఎవరూ పెద్దగా నమ్మలేదు ఆ ఇద్దరిమధ్యా ఆ అభిప్రాయ భేదాలు అలానే ఉండి పోయాయనే అనుకున్నారు...

     విభేదాలు తొలగిపోయాయి

    విభేదాలు తొలగిపోయాయి

    ఐతే ఇటీవల "గరుడవేగ" సినిమా విడుదల నేపథ్యంలో రాజశేఖర్ తన భార్య జీవితలో కలిసి రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన్ని సినిమా చూసేందుకు ఆహ్వానించడంతో ఇరువురి మధ్య ప్యాచప్ అయిందని అందరూ భావించారు. ఐతే తామిద్దరం కొత్తగా కలుసుకున్నదేమీ లేదని.. అంతకుముందే తమ మధ్య విభేదాలు తొలగిపోయాయని రాజశేఖర్ చెప్పాడు.

    ఫంక్షన్లలో కలిశాం

    ఫంక్షన్లలో కలిశాం

    గతంలో తన కూతురి మెడికల్ సీటు కోసం తాను చిరు ఇంటికి వెళ్లి కలిసినట్లు ఆయన వెల్లడించాడు. "చిరు గారితో నాకు విభేదాలు వచ్చాక కొన్నేళ్లు దూరంగా ఉండిపోయాను. కానీ ఆ తర్వాత అప్పుడప్పడూ కలుస్తూనే ఉన్నాం. ‘మేముసైతం'తో పాటు వేరే ఫంక్షన్లలో కలిశాం.

     శివాని మెడికల్ సీటు కోసం

    శివాని మెడికల్ సీటు కోసం

    అప్పుడు హాయ్ అంటే హాయ్ అనుకున్నాం అంతే. ఐతే ఒకసారి మా అమ్మాయి శివాని మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజీలో అప్లై చేశాం. ఆ విషయంలో సపోర్ట్ కోసం జీవిత.. చిరంజీవి గారి ఇంటికి వెళ్లింది. జీవిత వెళ్లగానే చిరంజీవి గారు నా గురించి అడిగారట.

    నేను రెడీ అయి లేను

    నేను రెడీ అయి లేను

    దీంతో జీవిత వెంటనే నాకు కాల్ చేసి రమ్మని చెప్పింది. కానీ నేను రెడీ అయి లేను. దీంతో ఆమె వెనక్కి వచ్చి నన్ను తీసుకెళ్లింది. చిరంజీవి గారు అప్పుడు బాగా మాట్లాడారు. మాకు అవసరమైన సాయం చేశారు. ఆ తర్వాత మేమిద్దరం బాగా కలిసిపోయాం. ‘గరుడవేగ' విషయంలో ఆయన చాలా సపోర్ట్ చేశారు" అని రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

    English summary
    Both Rajasekhar and Chiranjeevi were at loggerheads for quite some time. But, later,they started meeting at various functions and began greeting each other. They even met in the Memu Saitham programme.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X