twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజినికాంత్ గురించి ఆశ్చర్యకరమైన కొన్ని సంగతులు (ఫొటోలు)

    |

    తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తమిళుల ఆరాధ్య నటుడు.., భారతీయులందరికీ అభిమాన హీరో, ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు సినిమా పరంగా గుర్తింపు ఉంది. జపాన్, చైనా లో కూడా ఈయన సినిమాలు సూపర్ గా ఆడాయంటే ఏ రేంజ్ లో అక్కడ కూడా పాపులారిటీ సంపాదించాడు.భారత దేశానికి సంబందించినంత వరకూ రజినీ కాంత్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు అతనొక "హీరో".

    ఎక్కడైనా సినిమాకు ఇంత స్థాయిలో హైప్ వస్తుందా..? ఓ హీరో బొమ్మతో బంగారు నాణేలు విడుదలవుతాయా..? సినిమా పోస్టర్లను విమానాల మీద ముద్రిస్తారా..? ఒక సినిమా ఒకేసారి వేల థియేటర్లలో రిలీజ్ అవుతుందా..? ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సినిమా విడుదల తేదీన అధికారికంగా సెలవు ప్రకటిస్తుందా..? నమ్మలేని నిజాలనిపించే ఈ విశేషాలను కబాలి సినిమాతో నిజం చేసి చూపించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. నిన్నటి వరకు సౌత్ సూపర్ స్టార్ అనిపించుకున్న రజనీ.. ఈసినిమాలో ఇంటర్ నేషనల్ సూపర్ స్టార్ గా అవతరించాడు. బస్ కండక్టర్ నుంచి భారతీయులు గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చిన రజనీ తెర వెనక ఎలా ఉంటాడు..? ఆయన అలవాట్లేంటి..? బస్ కండక్టర్ శివాజీరావ్ గైక్వాడ్ నుంచి.. సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు..?

    తమిళులకు

    తమిళులకు

    సహజంగానే ఉండే ప్రాంతీయాభిమానం తమిళులకు మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ అది అందరూ అనుకునేంత తీవ్రంగా మాత్రం ఉండదు.. తెలుగు ఆదపడుచైన జయలైత అందుకు సాక్ష్య.. అలాగే తమిళులు దైవం లా చూసుకునే "మరాఠీ వాడైన శివాజీ రావ్ గైక్వాడ్" కూడా అతనే ఇప్పుడు సూపర్ స్టార్ అని పిలుచుకునే రజినీ కాంత్.

    కండక్టర్

    కండక్టర్

    కండక్టర్ గా పనిచేస్తున్న రజినీకాంత్ డైరెక్ట్ గా హీరో అయిపోలేదు.... కండక్తర్గా ఉన్నప్పుడే నాటకాలు వేయడం ప్రారంభించాడు. చివరికి 1975 లో ‘అపూర్వ రాఘంఘల్' సినిమా ద్వారా తమిళ చిత్ర సీమకి పరిచయమయ్యాడు. అలా కెరీర్ ప్రారంభించిన రజినీ 1978లో భైరవి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

    రజినీకాంత్

    రజినీకాంత్

    రజినీకాంత్ అంటే స్టైల్ కి ఐకాన్ గా చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా చాలా నిరాడంబరంగా జీవితాన్ని గడపడమే ఆయన స్టార్డంకి అసలైన కారణం. సినిమాల్లొ స్టయిల్ ఐకాన్ గా కనిపించే రజినీ నిజ జీవితం లో మాత్రం అలా ఉండడు...

    బాలచందర్‌

    బాలచందర్‌

    రజనీ కాంత్ ప్రతి హోలీ పండుగకు త న గురువు బాలచందర్‌ బతికున్న రోజుల్లో ఆయనకు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకునే వాడట. కానీ హోలీ రోజే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం బాలచందర్‌కూ తెలియదు. కొ న్ని సంవత్సరాల తర్వాత అడిగితే.. 'శివాజీ రావ్ గైక్వాడ్ గా ఉన్న నా పేరును రజనీకాంత్ గా మార్చింది హోలీ రోజునే సార్‌!" అంటూ చెప్పాడట. 'ముల్లుం మలరుం' చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్‌ రాసిన ఉత్తరాన్ని నేటికీ భద్రంగా దాచుకున్నాడు.

    ఓం

    ఓం

    రజనీకాంత్‌ ఇంట్లో ఉన్నప్పుడు నిత్యం 'ఓం'కార నాదం వింటూనే ఉంటారు. ఆయన ఇష్ట దైవం వినాయకుడు.

    కాకా హోటళ్లలో

    కాకా హోటళ్లలో

    రోడ్డుపక్కనున్న కాకా హోటళ్లలో భోజనం చేయటం రజనీకి చాలా ఇష్టం. పోరూర్‌ సిగ్నల్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇప్పటికీ వెళ్లొస్తారట. మెరీనా బీచ్లో అమ్మే వేరుశనగలంటే రజనీకాంత్‌కు చాలా ఇష్టం. అప్పుదప్పుడూ అవి తినటానికే మెరీన బీచ్ కి వెళ్తాడట.రజనీకాంత్‌ మాంసాహార ప్రియుడు. ముఖ్యంగా మటన్‌, తలకాయ కూరంటే ఇష్టంగా తింటాడు.

    ఏవీఎం స్టూడియోలో

    ఏవీఎం స్టూడియోలో

    ఏవీఎం స్టూడియోలో షూటింగ్ జరిగితే.. రజనీకాంత్‌ నెంబర్ 10 మేకప్ రూమ్ లో బస చేస్తారు. అది ఆయనకు సెంటిమెంట్.చెన్నైలో షూటింగ్‌ అంటే రజనీకే కాకుండా, మరో 25 మంది వరకు భోజనం ఆయన ఇంటి నుంచే వెళ్తుంది.

    ఉద్యోగం

    ఉద్యోగం

    తన ఇంటిలో ఉద్యోగం చేస్తున్న అందరికీ నీలాంగరైలో ఓ ప్లాట్‌ను కొనిచ్చారు. వారిపేరుపై కొంత మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కూడా చేశారు.తన దగ్గర పాతికేళ్ల పాటు పనిచేసి తరువాత మానేసిన ఉద్యోగికి ఇప్పటికీ జీతం ఇస్తూనే ఉన్నాడు.తన ఏ సినిమా షూటింగ్ పూర్తి చేసినా, ఆ చిత్రానికి పనిచేసి సహాయకులకు కొంత మొత్తాన్ని కానుకగా ఇస్తుంటాడు రజనీ.

    రజనీకాంత్‌

    రజనీకాంత్‌

    'ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు'.. ఈ సూక్తే రజనీకాంత్‌ గుమ్మంపై ఉంటుంది. పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్‌ ఇంటి పేరు 'బృందావన్‌'. ఇది ఆయనే పెట్టుకున్నారు. ఆ ఇంటిపై 'సత్యమేవజయతే..' అని పెద్దక్షరాలతో రాయించాడు. కష్టం తోనే దేన్నైనా సాధించగలం అని నమ్మే రజినీకి దైవభక్తి ఎక్కువే అయినా మూఢభక్తి మాత్రం కాదు. అదృష్టం లాంటి గుడ్డి నమ్మకాలు లేవు.

    జుజుబీ

    జుజుబీ

    రజనీకాంత్‌ మాట్లాడిన తొలి పంచ్‌ డైలాగ్‌ 'ఇదు ఎప్పడి ఇరుక్కు'(ఇది ఎలా ఉంది?). ఎక్కువగా పాపులర్ అయిన ఊతపదం మాత్రం "జుజుబీ"

    ఎస్‌.పి.ముత్తురామన్‌

    ఎస్‌.పి.ముత్తురామన్‌

    తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు,. ఆయన కెరీర్ లో అత్యధికంగా ఎస్‌.పి.ముత్తురామన్‌ దర్శకత్వంలో 25 చిత్రాల్లో నటించాడు.

    హిమాలయాలనే

    హిమాలయాలనే

    హిమాలయాలనే కాకుండా ఏ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లినా అక్కడి రుద్రాక్షలను సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన రుద్రాక్షలు రజనీ ఇంటిలో కుప్పలతెప్పలుగా ఉంటాయి.

    తలైవా

    తలైవా

    తలైవా.. మీ పుట్టినరోజునాడు మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నామ'ని అభిమానులు అడిగితే.. 'అసలు నేనెందుకు పుట్టాననే విషయాన్ని తెలుసుకునేందుకు ఆ రోజంతా ఏకాంతంగా గడుపుతాను. ప్లీజ్‌ ఆరోజున నన్ను వదిలేయండి'అని అభిమానులకు దూరంగా ఉంటాడు. తనకు ఎంత ఆప్తులైనా వారికోసం ఎలాంటి రికమండేషన్ లూ చేయడు..

    రజనీకి

    రజనీకి

    రజనీకి ఇప్పటికీ పర్సు, క్రెడిట్‌ కార్డులు వాడే అలవాటు లేదు. బయకెళ్లినప్పుడు ప్యాకెట్‌ మనీగా రూ.500 మాత్రమే తీసుకెళ్తాడు. అప్పుడప్పుడు స్నేహితుల ఇంటికి అకస్మికంగా వెళ్లి వారితో ఆనందంగా సమయం గడుపుతుంటాడు.

    రిహార్సల్స్‌

    రిహార్సల్స్‌

    ఇప్పటికీ తన ఇంటిలోని పెద్ద అద్దం ముందు నిలబడి రిహార్సల్స్‌ చేస్తూంటాడట. సిగరెట్‌ తాగటం చాలా ఇష్టం. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పుడా అలవాటు మానుకున్నారు. టూవీలర్ నడుపుతూ చెన్నై వీదుల్లో తిరగటం అంటే సరదా.. అప్పుడప్పుడు మారువేశాల్లో అలా బయటికి వస్తుంటారు.

    ఫిలిం ఛాంబర్‌

    ఫిలిం ఛాంబర్‌

    ఫిలిం ఛాంబర్‌ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో చాలా సందర్భాల్లో ఫీజు కూడా కట్టలేకపోయేవారట. ప్రిన్సినల్‌ రాజారామ్‌దాస్‌సహాయం చేశారట. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటుంటారు. అందుకే రజినీకి మనుషులంటే విపరీతమైన గౌరవం. తనను కలిసేందుకు ఎవరు వచ్చినా, వయస్సులో చిన్నవారైనా లేచి నిలబడి వారిని ఆహ్వానిస్తాడు. వాళ్ళుకూర్చున్నాకే తాను కూర్చుంటాడు.

    రజనీ

    రజనీ

    రజనీకి రోజూ రెండు మూడు సినిమాలు చూడటం అలవాటు.. అందులోనూ తప్పనిసరిగా రోజు ఓ ఇంగ్లీష్ సినిమాను చూస్తాడు. ప్రతీ నెలా ఒకరోజున ఇరవైసార్లుకు పైగా రక్తదానం చేసిన అభిమానులకు తన సంతకంతో కూడిన ప్రశంసాపత్రం పంపిస్తారు.

    బ్లాడ్‌ స్టోన్‌

    బ్లాడ్‌ స్టోన్‌

    రజనీకాంత్‌ నటించిన ఏకైన ఆంగ్ల చిత్రం 'బ్లాడ్‌ స్టోన్‌' 1988 అక్టోబరు 7న విడుదలైంది. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు రజనీ.

    కారు

    కారు

    రజనీకాంత్‌ ఏ కారులో వస్తాడనే విషయాన్ని ఎవరూ ముందే ఊహించలేరు. ఖరీదైన కార్లకు దూరంగా ఉండే సూపర్‌స్టార్‌ అంబాసిడర్‌, క్వాలీస్‌లో మాత్రమే ప్రయాణిస్తుంటాడు.

    ఆభరణాలను

    ఆభరణాలను

    ఆభరణాలను రజనీ ఇష్టపడడు. గతంలో కుడిచేతికి కడియం ఉండేది చాలా సంవత్సరాలు రజినీ వాడిన ఏకైక ఆభరణం ఆ కడియమేఇప్పుడది నెల్త్లెకి చెందిన తన అభిమాని తిరుమారన్‌ కు బహుమతిగా వెళ్లింది..

    English summary
    Thalaiva of Tamilnadu overcoming his Marathi and Kannadiga background has all the elements of cinematic twists . His story is inspiring for any poor and downtrodden who can aspire for success in any sphere.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X