దాసరి పై భయంతోనే రామ్ గోపాల్ వర్మ వదిలేసాడా?
రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు కోసం ఓ పాట రాయించారు. ఎవడబ్బ సొమ్ము కాదురా టాలెంటు అంటూ సాగే ఆ పాటలో రాఘవేంద్రరావుని మొదలుకుని టాలీవుడ్ లో స్టార్ డైరక్టర్స్ ని రాజమౌళితో సహా అందరినీ ఏకి పారేశారు. అయితే ఆ పాటలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు పేరు లేకపోవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన వర్మకు అందుకు కూడా పనికిరాకుండా పోయాడా అని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎవర్ని అన్నా లైట్ గా తీసుకోవచ్చు గానీ దాసరిని అంటే తిరిగి వెంటనే కౌంటర్ వేస్తారనే భయంతోనే రామ్ గోపాల్ వర్మ ఆయన జోలికి వెళ్ళటం లేదని వినపడుతోంది. అయితే ఓపినింగ్ సమయంలో ఆయన ఫొటో పెట్టి ప్రేమాభిషేకం పోస్టర్ పెట్టి గౌరవం మాత్రం ఇచ్చారు. అదీ సంగతి.
రామ్ గోపాల్ వర్మ కోటి దాసరి నారాయణ రావు అప్పలరాజు రాజమౌళి sunil rajamouli ram gopal varma dasari narayana rao appalaraju


Click it and Unblock the Notifications