వర్మ సైలెన్స్ వెనుక కారణమేమిటి?: వర్మని బెదిరించారా?? అంటూ సెటైర్లు
రీసెంట్‌గా హీరోయిన్ ఛార్మీ పోస్ట్ చేసిన వీడియోలో శ్రీదేవి వీడియో చూస్తూ మైమరిచి పోతున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది అంతే తప్ప ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క పోస్ట్ గానీ, వ్యాఖ్య గానీ రామ్ గోపాల్వర్మనుంచి రాలేదు శ్రీదేవి గురించి కాదు... లేటెస్ట్ టాపిక్ అయిన ఇవాంకా గురించి. మామూలుగా ఏ చిన్న సంఘటననీ వదలని వర్మ అదేంటో గానీ ఈ సారి మాత్రం కామ్ అయిపోయాడు...

అందాలని ఆస్వాదిస్తా
ఇవాంకా వస్తూందన్న మాట వినగానే "ఆమె అందాలని ఆస్వాదిస్తా అంటూ" మొదలు పెట్టిన ఆ తర్వాత మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు... ఇవాంకా ట్రంప్ ఇండియాలో అడుగు పెట్టకముందు ఆమెను సన్నిలియోన్‌తో, కేసీఆర్‌తో పోల్చి పంచ్‌లు పేల్చాడు అయితే ఆమె హైదరాబాద్ రావడం, తిరిగి అమెరికా వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది.

ఎటువంటి రియాక్షన్ లేదు
కానీ వర్మ నుండి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు. రెండు రోజుల పాటు ఇవాంకా హైదరాబాద్‌లో ఉండి తను వచ్చిన పని చూసుకుని వెళ్లిపోయింది. ఆమె వస్తుందని అడుగడుగునా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ఆమె వేసుకున్న డ్రస్సు
ఆమె వేసుకున్న డ్రస్సు, మోడీతో కరచాలనం, కేటీఆర్‌తో నవ్వుతూ పలకరింపులు, గోల్కోండ కోట గురించి ఆసక్తికరంగా ఆమె తెలుసుకోవడం, ఫలక్‌నామా ప్యాలెస్‌లో విందు.. ఇలా వర్మకి కావాల్సిన అనేక అంశాలు జరిగినా.. ఏ ఒక్కదానిపై వర్మ రియాక్ట్ అవలేదు. అయితే వర్మ రియాక్ట్ అవకపోవడంపై కూడా అనుమానాలు వస్తున్నాయి.

ఏదో ఒకటి పోస్ట్ చేసి
ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ చేసి వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వర్మ ఇలా ఒక్కసారిగా సెలైంట్ అయిపోవడానికి కారణం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం వర్మని ముందుగానే నోరు మూయించిందా? ఈ రెండు రోజులు వర్మని కస్టడీలోకి తీసుకున్నారా?

హౌస్ అరెస్ట్ చేశారా?
'వర్మ నుండి ఫోన్ తీసేసుకుని హౌస్ అరెస్ట్ చేశారా? అంటూ కొన్ని సెటైర్లు కూడా పడుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా దేశం మొత్తం దృష్టి సారించీ ఈవెంట్ ఇది వర్మ మార్క్ పంచ్ లు ఖచ్చితంగా ఉంటాయనుకున్నారు. కానీ ఇంతపెద్ద ఈవెంట్ నీ చప్పగా తేల్చేసాడు... అందరికీ ఏమో గానీ వర్మ పోస్ట్ లకి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రం ఈ సారి మనోడి పంచ్ లని బాగానే మిస్సైనట్టున్నారు....


Click it and Unblock the Notifications











