Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ గోపాల్ వర్మ గాయం 2 ను ఎందుకు డైరక్ట్ చేయటం లేదు
గాయం సీక్వెల్ గురించి జగపతిబాబు మాట్లాడుతూ..మొత్తానికి గాయం సీక్వెల్ షూటింగ్ కి రెడీ అవుతోంది. డిసెంబర్ రెండున(ఈరోజు)ఈ చిత్రం పూజ ఫార్మల్ గా చేస్తాము. రామ్ గోపాల్ వర్మ వద్ద పనిచేసిన ప్రవీణ్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ సీక్వెల్ కరెక్టుగా పద్దతి ప్రకారం వస్తున్న మొదటి తెలుగు సీక్వెల్. పదిహేనేళ్ళ తర్వాత ఈ చిత్రంలో పాత్రలు ఇప్పుడు ఏం చేస్తున్నాయో వాటి చుట్టూనే కథ నడుస్తుంది. దుర్గా మళ్ళి హీరోగా వస్తాడు. రేవతి తన పాత్రను మళ్ళీ చేయటానికి ముందుకు వచ్చింది. కోట శ్రీనివాసరావు తన పాత్రలో జీవించబోతున్నారు.ఇక ఊర్మిళతో మాట్లాడాను..అన్నారు. మరి రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని ఎందుకు డైరక్ట్ చేయటం లేదు అంటే..ప్రవీణ్ ఈ ఐడియాని డవలప్ చేసాడు. స్క్రిప్టు పూర్తిగా రాసుకున్నాడు. వర్మ పూర్తిగా దానిని విన్నాడు. సాపర్భ్ అని మెచ్చుకున్నాడు. అతని శిష్యుడుతో చేయమని చెప్పాడు. అలాగే అతను తయారు చేసుకున్న బిడ్డ ఆ స్క్రిప్టు దానిని తాను తస్కరించలేనని అన్నారు. అయితే అవసరమైన సమయంలో సలహాలు,సూచనలు ఈ ప్రాజెక్టుకు అందచేస్తానని మాటిచ్చారని చెప్పుకొచ్చారు.