twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇద్దరమ్మాయిలతో’ నా అంతట నేను వదులుకున్నా

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' ఓ అమ్మాయిగా ముందు రిచా గంగోపాధ్యాయను తీసుకున్నారు. మళ్లీ ఏమైందో ఏమో ఆమెను తప్పించి తాప్సీని ఓకే చేశారు. అంతకు ముందు కూడా రిచా గంగోపాధ్యాయ వెంకటేష్ 'షాడో' సినిమాలో హీరోయిన్ గా తొలుత రిచాను ఖరారు చేశారు. కానీ అనుకోకుండా ఆమె స్థానంలోకి తాప్సీ వచ్చిచేరింది. ఆ తర్వాత కార్తీ హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న 'బిర్యానీ' సినిమాలో కూడా రిచానే హీరోయిన్ అన్నారు. తర్వాత ఆమె స్థానంలో నీతూచంద్ర చేరిపోయింది. ఇవన్నీ ప్రతిష్టాత్మక చిత్రాలే కావడం గమనార్హం. వాటినుంచి రిచానే తప్పుకున్నారా? లేక తప్పించారా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న.

    ఈ విషయమై రిచా గంగోపాధ్యాయ ను మీడియా కలిసింది. రిచా స్పందిస్తూ ...''అవన్నీ నా అంతట నేను వదులుకున్న సినిమాలే. సినిమా అనేది ఒప్పుకోవడానికి ఎన్ని కారణాలుంటాయో... తప్పుకోవడానికి అంతకంటే ఎక్కువ కారణాలుంటాయి. వాటి గురించి చర్చలు లేవదీయడం వేస్ట్. ప్రస్తుతం తెలుగులో మిర్చి, సారొచ్చారు సినిమాలు చేస్తున్నా. మరో అగ్ర హీరో సినిమాకు కూడా సైన్ చేశాను. ఇవిగాక తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నా. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగానే ఉన్నా. కాబట్టి వదిలేసిన సినిమాల ప్రస్థావన ఇప్పుడు నాకు అనవసరం'' అంది.

    దేశముదురు కాంబినేషన్ అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ ని రిపీట్ చేస్తూ బండ్ల గణేష్ నిర్మించే 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం బారీగా రూపొందనుంది. హీరోయిన్స్ సెంట్రల్ గా నడిచే కధ కాబట్టి ఆ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. 2013 సమ్మర్ కి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం.

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పను. నాకెంతో నచ్చింది. ఎప్పట్నుంచో సినిమా చేద్దాం అని గణేష్ అడుగుతున్నారు. ఈ చిత్రంతో కుదిరింది. ఒక మంచి నిర్మాతకు కావల్సిన అన్ని లక్షణాలు గణేష్‌లో ఉన్నాయి. 'దేశముదురు' సమయంలో నేను సిక్స్‌ప్యాక్ చేయగలిగానంటే దానికి కారణం జగన్‌గారే. చెప్పిన సమయానికి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి, నాకు వర్కవుట్లు చేసుకునే అవకాశం కల్పించేవారు'' అన్నారు.

    పూరి చిత్రం గురించి చెబుతూ ''ఇదో ప్రేమ కథా చిత్రం. బన్నీ అంటేనే ఎనర్జీ. తనే కాదు సెట్‌లో అందర్నీ ఉత్సాహంగా ఉరకలేయిస్తారు. ఈ కథను అల్లు అరవింద్‌కు చెప్పినపుడు మావాడికి బాగుంటుందని చెప్పారు. తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో. ఈ సినిమా కథను బన్నీకి చెప్పినప్పుడు.. మనమే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత అరవింద్‌గార్ని కలిసినప్పుడు 'బన్నీకి ఒక కథ చెప్పావట.. అది తనతోనే చెయ్యి. తనకు బాగా నచ్చింది' అన్నారు. ఇది లవ్‌స్టోరి. నవంబర్ రెండవ వారంలో షూటింగ్ ఆరంభిస్తాం. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం షూటింగ్ చేస్తాం''అన్నారు.

    English summary
    Allu Arjun's Iddaru Ammayilatho movie's actress Richa Gangopadhyay has been replaced by Tapsee Pannu. About 90% of the shooting of Iddaru Ammayilatho, touted to be a love story, is expected to take place in a foreign country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X