ఎన్టీఆర్, మహేష్ లకు భయపడే 'రోబో'ని...
'రోబో' చిత్రం రేపు (అక్టోబర్ 1) మన రాష్ట్రంలో దాదాపు 525 థియేటర్లలో విడుదలవుతుంది. ఓ అనువాద చిత్రం మన రాష్ట్రంలో ఇంత భారీగా విడుదల కావడం ఇదే తొలిసారి. అందులో ముఖ్యంగా నైజామ్ ప్రాంతంలో 175 థియేటర్లలో విడుదల చేయనున్నారు. అలాగే జంటనగరాలు, శివార్లలో 70 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఎందుకు ఎప్పుడూ లేనన్ని ధియేటర్లలో విడుదల చేస్తున్నారు అన్న ప్రశ్నని పంపిణీదారుల ముందు ఉంచితే...నెక్ట్స్ వీక్ లోనే మహేష్‌బాబు ఖలేజా, ఎన్టీఆర్ బృందావనం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటి సినిమాల కోసం ఆయా హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవి కూడా భారీ ఎత్తునే విడుదలవుతాయి. కాబట్టి అందుబాటులో ఉన్నన్ని థియేటర్లలో రోబోని ఆడించాలన్నది హక్కులు పొందినవారి ఆలోచన. ఆ సినిమాలు విడుదల అయితే రోబో కి కలెక్షన్స్ తగ్గుతాయని బావిస్తున్నారు. ఈ లోపలే జనాల్ని మొత్తం రోబో చిత్రం చూసేలా చేసే ప్రయత్నమే...ధియోటర్స్ పెంచటం.


Click it and Unblock the Notifications











