అందరూ మెచ్చిన సినిమా పై షారుఖ్ ఎందుకు మాట్లాడలేదు..!
సల్మాన్ ఖాన్ కు పూర్వవైభవం తెచ్చిన సినిమా దబాంగ్. యావత్ సల్మాన్ ఖాన్ అభిమానులు మరలా గుండెపై చెయ్యి వేసుకోని ఇది మన సినిమారా అనిచెప్పకునే విధంగా సల్మాన్ ఖాన్ యక్షన్ ఉంది. సల్మాన్ ఖాన్ ఓ సరికోత్త కోణంలో చూశారు ఆయన అభిమానులు ఈ సినిమాలో. ఈ సినిమాని చూసిన షారుఖ్ ఖాన్ మాత్రం సినిమా పై ఎలాంటి కామెంట్ చెయ్యకపోవడంతో బాలీవుడ్ లో కొంత ఉత్కంఠ నెలకొంది. షారుఖ్ ఖాన్ కూడా అందరిలాగే ఈ సినిమా చూడాలనుకున్నాడు.
ఐతే స్ర్కీనింగ్ కోసం సల్మాన్ ఖాన్ ని గాని, సినిమా ప్రోడ్యూస్ చేసిన సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ గాని సంప్రదించలేదు. ఎవరో సినిమా యూనిట్ కి చెందిన వ్యక్తులకు చెబితే, అర్బాజ్ ఖాన్ అనుమతితో స్పెషల్ గా వీరిద్దరికోసం ఒక షోని ఏర్పాటు చేశారంట. తర్వాత షారుఖ్ భార్య గౌరి, అర్బాజ్ ఖాన్ కి ఫోన్ చేసి తమ పిల్లలు ఆర్యన్, సుహాన లకోసం మరోసారి షో ని ఏర్పాటు చేయమని అడగగా ఈ సారి అర్బాజ్ ఖాన్ దగ్గరుండి మరి షోను ఏరెంజ్ చేశాడంట. ఇలా ఏరేంజే చేసినందుకుగాను షారుఖ్ ఏమైనా ఈ సినిమా గురించి మాట్లాడతాడేమోనని అనుకున్న అర్బాజ్ ఖాన్ కు భంగపడ్డట్టు అయిందంట.


Click it and Unblock the Notifications











