మిగతా హీరోయిన్స్ కూడా బ్రతకాలికదా...శ్రియ
అన్ని సినిమాలూ ఒక్కరే చేసేస్తే మిగిలిన వాళ్లకు అవకాశాలు ఉండొద్దా?అందుకే తగ్గించుకుంటున్నాను అంటోంది శ్రియ. ఆమెను రీసెంట్ గా మీడియావారు...ఏంటి..ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు? అంటే ఇలా ఎదురు ప్రశ్నే వేసి వాళ్ళకి నోట మాట రాకుండా చేసింది. అలాగే ...అయినా మనకిక్కడ సినిమాలకు లోటేముంది? వందలాది సినిమాలు వస్తుంటాయి. ఎంతమంది వచ్చినా ఇంకొకరికి చోటుంటుంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం ముఖ్యం. మధ్యలో గ్యాప్ వస్తుందని వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకోలేం కదా అని ముక్తాయించింది. అయినా కెరీర్ లో..ఆఫర్స్ ఒక్కోసారి ఒక్కోలా వస్తాయి. ఎవరికైనా హెచ్చుతగ్గులుంటాయి అంది. గ్యాప్ తర్వాత రవితేజ సరసన 'డాన్ శీను'లో చేసిన ఈ ముద్గగుమ్మ...పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పులిలోనూ ఐటం సాంగ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











