ఎన్టీఆర్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా

By Srikanya

నాకు ఇష్టమైన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు, తనతో నటించే అవకాశం మళ్లీ వస్తే పొరపాటున కూడా వదులుకోను అని శృతి హాసన్ అన్నారు. దమ్ము చిత్రంలో ఆమె తెలిపారు. 'దమ్ము" సినిమా నుంచి ఉన్నట్టుండి తప్పుకొని ఆ యూనిట్ మొత్తానికి శృతి ఝలక్ ఇచ్చారని ఈ మధ్య మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిపై స్పందిస్తూ శృతిపై విధంగా చెప్పుకొచ్చారు. అలాగే... ఇలాంటి కథనాల వల్ల నాపై అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. దయచేసి లేనిపోనివి పుట్టించొద్దు. కేవలం డేట్స్ ప్రాబ్లమ్ వల్లనే ఆ సినిమా నుంచి తప్పుకున్నాను కానీ వేరే కారణం కాదు. కొంతమంది మీడియావారు నన్ను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారు. అది పద్ధతి కాదు అని చెప్పారామె. ఇక నాన్న ఎన్నో భాషల్లో నటించారు. కానీ ఆయనకు తెలుగు భాషంటే ప్రత్యేక ఆభిమానం. నాకూ అంతే. ఇక్కడి పద్ధతులు, సంస్కారం నాక్కూడా నచ్చుతాయి. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నాను. త్వరలో డబ్బింగ్ కూడా చెబుతా అంది.

ఇటీవల 'దమ్ము" చిత్రం విషయమై తనపై వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని, తెలుగన్నా, ఇక్కడి ప్రజ-సంస్కృతి అన్నా.. తనకెంతో ఇష్టమని చెప్పింది శృతి. ఇంతకుముందే కమిట్‌ అయిన వేరే ప్రాజెక్టులకు, వాటి నిర్మాతలకు ఇబ్బంది కలుగకూడదనే ఎన్టీఆర్‌ సినిమానుంచి తప్పుకోవాల్సొచ్చిందని స్పష్టతనిచ్చింది. తన లేటెస్ట్ చిత్రాలు.. సెవెన్త్‌ సెన్స్‌, ఓ మై ఫ్రెండ్‌ ల-ను ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇక శృతి హాసన్ బయిటకు వచ్చేయటంతో దమ్ములో ఆమె బదులుగా త్రిషను తీసుకున్నారు. అలాగే సెకండ్ హీరోయిన్ గా కార్తిక చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X