జనం దండిగా రావాలనే బాలయ్య ప్లాన్?
నందమూరి బాలకృష్ణ-బాపు కాంబినేషన్లో వచ్చిన పౌరాణిక చిత్రం 'శ్రీరామ రాజ్యం' 50 రోజుల దిశగా దూసుకెలుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను విజయవాడలో జనవరి 5న ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు కూడా. అయితే విజయవాడలోనే ఈ సినిమా 50 రోజుల వేడుక ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? హైదరాబాద్, వైజాగ్ లాంటి పెద్ద సిటీలు ఉన్నాయి కదా... అని చాలా మంది సందేహ పడుతున్నారు.
అయితే సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం..... ఈ వేడుకకు జనం తండోపతండాలుగా తరలి రావాలనే ప్లాన్ తోనే బాలయ్య, సినిమా దర్శక నిర్మాతలు ఈ ఫంక్షన్ విజయవాడలో డిసైడ్ చేశారని అంటున్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన దూకుడు 50 రోజుల వేడుకకు ఫుల్లుగా జనం తరలి వచ్చారు. గతంలో చిరంజీవి ఇంద్ర సినిమా 175 రోజుల సెలబ్రేషన్స్ కు అప్పట్లో ఏకంగా 8 లక్షల మంది తరలి వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు.
నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా బాలయ్యకు కృష్ణ జిల్లాలో ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే జిల్లాలోనూ లేదు. నందమూరి కుటుంబీల స్వస్థలం నిమ్మకూరు ఇదే జిల్లాలో ఉంది. ఈ నేపథ్యంలో బెజవాడలో 50 రోజుల వేడుక ఏర్పాటు చేస్తే.....తన స్టార్ హోదాకు తగిన విధంగా అభిమానులు తరలివస్తారు. ఒక వేళ వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే జనాలు రాక పోతే పరువు పోతుందని, అలా జరుగకుండా ఉండాలంటే బెజవాడే బెస్ట్ అని చివరగా నిర్ణయానికి వచ్చి ఏర్పాట్లు మొదల పెట్టారు.


Click it and Unblock the Notifications











