అదిరిపోయే పాత్ర అనుకున్నారు: అయినా 'అజ్ఞాతవాసి' నుంచి సునీల్ ఔట్, కారణమిదే?

Recommended Video

'అజ్ఞాతవాసి' నుంచి సునీల్ ఔట్ ! కారణం ఇదే..

ఒకే గూటి నుంచి వచ్చిన సినీ పక్షులు.. కష్టాల్లో ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలవడం సహజం. అందుకే కష్టాల్లో ఉన్న తన మిత్రుడు సునీల్‌ను ఆదుకోవాలని కంకణం కట్టుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. హీరోగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సునీల్‌ను తిరిగి కమెడియన్‌గా మళ్లీ ట్రాక్ ఎక్కించాలని చూస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్‌తో తెరకెక్కించిన అజ్ఞాతవాసి చిత్రం ద్వారా సునీల్‌ను మరోసారి పూర్తి స్థాయి కమెడియన్ పాత్రలో చూపించాలనుకున్నాడు. సునీల్ కూడా ఓకె అనడంతో.. ఇక సినిమాలో ఆయన కనిపించడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ చివరి నిమిషంలో అంతా తారుమారైంది. ఇంతకీ ఏమైంది..

 అదిరిపోయే పాత్ర అనుకున్నారు!:

అదిరిపోయే పాత్ర అనుకున్నారు!:

హీరోగా 2కంట్రీస్ సినిమా చేస్తున్న సమయంలోనే అజ్ఞాతవాసిలోనూ నటించాలని సునీల్ భావించాడు. త్రివిక్రమ్ ప్రతిపాదన మేరకు కథా చర్చల్లోనూ పాల్గొన్నాడు. పూర్తి స్థాయి హాస్య నటుడిగా సునీల్ పునరాగమం అదిరిపోయే రీతిలో త్రివిక్రమ్ ఆయన పాత్రను తీర్చిదిద్దారు. కానీ..

 కానీ..,త్రివిక్రమ్ అనుకున్నట్లుగా!:

కానీ..,త్రివిక్రమ్ అనుకున్నట్లుగా!:

పూర్తి స్థాయి కమెడియన్ గా సునీల్ రీఎంట్రీ ఆయన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయే అవకాశం ఉండటంతో త్రివిక్రమ్ చాలానే జాగ్రత్తపడ్డాడట. అందుకు అనుగుణంగానే సునీల్ పాత్ర చుట్టూ కొన్ని సన్నివేశాలు అల్లారట. అయినా సరే.. త్రివిక్రమ్‌కు ఎక్కడో తేడా కొడుతున్నట్లే అనిపించదట.

 అక్కడే ఆగిపోయింది:

అక్కడే ఆగిపోయింది:

ఇంత చేసినా.. ఎందుకనో త్రివిక్రమ్ సంతృప్తి చెందలేదట. సునీల్ కోసం ఆయన రాసిన పాత్ర ఆకట్టుకునే రీతిలో లేదన్న సందేహం కలిగిందట. ఆ సందేహం కలగడమే ఆలస్యం.. ఇప్పటికి ఈ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టేద్దామనుకున్నారట. అలా అజ్ఞాతవాసిలో సునీల్ పాత్ర స్క్రిప్ట్ వర్క్ దగ్గరే ఆగిపోయింది.

త్రివిక్రమ్ పైనే నమ్మకంతోనే:

త్రివిక్రమ్ పైనే నమ్మకంతోనే:

అజ్ఞాతవాసిలో పాత్ర మిస్సవడం సునీల్ కు బాధగానే ఉన్నా.. తన కోసం త్రివిక్రమ్ ఎప్పటికైనా మంచి పాత్ర రాస్తారనే నమ్మకంతో ఉన్నాడు. అనుకున్నట్లుగా సునీల్ పాత్రను త్రివిక్రమ్ అద్భుతంగా రాసి ఉంటే.. అజ్ఞాతవాసిలో కామెడీ బీభత్సంగా ఉండేది.

2కంట్రీస్.. రేపే విడుదల:

2కంట్రీస్.. రేపే విడుదల:

సునీల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటించిన '2కంట్రీస్' సినిమా డిసెంబర్ 28న విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాతో సునీల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమా గనుక హిట్ సాధిస్తే సునీల్ కెరీర్ కాస్త గాడిన పడుతుంది. కాబట్టి ఈ సినిమాపై గంపెడాశతో ఉన్నాడు సునీల్. చూడాలి మరి.. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకుడి తీర్పు ఎలా ఉండబోతుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X