అర్జున్ రెడ్డి దర్శకుడిని మన హీరోలు ఎందుకు నమ్మడం లేదు?

ఒక సినిమా హిట్టయితే సాధారణంగా అందులోని హీరో హీరోయిన్స్ కి అవకాశాలు ఎంత స్పీడ్ గా వస్తాయో తెలియదు గాని.. దర్శకులకు మాత్రం బెస్ట్ ఆఫర్స్ వస్తాయని చెప్పవచ్చు. స్టార్ హీరోలు ఏరికోరి మరి హిట్టిచ్చిన దర్శకుడిని ఎంచుకుంటారు. ముఖ్యంగా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో హిట్టు కొట్టేవారికి సినిమా ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే అర్జున్ రెడ్డి దర్శకుడిని మాత్రం సొంత ఇండస్ట్రీలో ఎవరు నమ్మకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

మొదటి సినిమాతోనే..

మొదటి సినిమాతోనే..

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త మేకింగ్ ఆఫ్ స్టైల్ ని పరిచయం చేసిన ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ కెరీర్‌కి మంచి కిక్కిచ్చాడు. ఆ సినిమా విడుదలైనప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు సీనియర్ దర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇది సరికొత్త సినిమా అంటూ దర్శకుడి పనితనాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు.

అంతకంటే హై రేంజ్ లో..

అంతకంటే హై రేంజ్ లో..

ఇక అదే కథను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కించిన సందీప్ అక్కడ కూడా బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. సినిమా విడుదలైన రోజే నార్త్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇకపోతే సందీప్ వంగా తెలుగులో స్టార్ హీరోలని లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తుండగా ఎవరు కూడా అతడిని నమ్మడం లేదు. మహేష్ బాబు చాలా సార్లు సందీప్ తో కలిసి స్టోరీ డిస్కషన్ చేశాడు.

 ఎందుకు నమ్మడం లేదు.

ఎందుకు నమ్మడం లేదు.

కానీ ఇంతవరకు వారి కాంబినేషన్ పై కొంచెం కూడా క్లారిటీ ఇవ్వలేదు. అల్లు అర్జున్, ప్రభాస్ లకు కూడా స్టోరీ లైన్ వినిపించిన సందీప్ వారి నుంచి కూడా సరైన సమాధానం అందుకోలేరు. బాక్సాఫీస్ వద్ద బెస్ట్ హిట్ కొట్టిన తెలుగు దర్శకుడికి రెండవ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు.

Recommended Video

Sri Reddy Comments Goes Viral
టార్గెట్ బాలీవుడ్..

టార్గెట్ బాలీవుడ్..

బాలీవుడ్ లో సక్సెస్ కొట్టి రణ్ వీర్ సింగ్‌ని తదుపరి సినిమా కోసం లైన్ లో పెట్టినప్పటికి మన స్టార్ హీరోలు ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు సందేహిస్తున్నారట. లాక్ డౌన్ లో చాలా మంది తెలుగు హీరోలతో స్టోరీపై డిస్కషన్ చేసిన సందీప్ వంగాకు సరైన సమాధానం దొరకలేదు. అందుకే ఇప్పుడు తన దృష్టి మొత్తం బాలీవుడ్ వైపే మళ్లింది. అక్కడ మరో బిగ్ సక్సెస్ అందుకొని టాలీవుడ్ హీరోలను ఎట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X