ఐశ్వర్యరాయ్ కూతురు పేరు ఎట్టకేలకు ఖరారు!
ఐశ్వర్యరాయ్ కూతురు పేరు దాదాపుగా ఖరారైంది. వినడానికి ఇది ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం. ఆలియా, అభినందికా, అనన్య, అభిలాష....ఇలా చాలా పేర్లు 'బేటి బి'కి వినిపించాయి. బేటి బి పేరుపై రకరకాల ప్రచారం జరగినప్పుడల్లా బచ్చన్ కుటుంబ సభ్యులు అమితాబ్, అభిషేక్ తదితరులు ఖండిస్తూ వస్తున్నారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని, మేము ఇంకా పేరు ఖరారు చేయలేదని చెప్పుకుంటూ వచ్చారు.
తాజాగా బేటి బికి 'ఆరాధ్య' అనే పేరు ఖరారు చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ పేరు గత రెండు రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్నా బచ్చన్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఖండన లేదు. మౌనం అంగీకారంతో సమానం కాబట్టి ఇదే బేటి బి అఫీషియల్ నేమ్ అని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...మరో రెండుమూడు రోజుల్లో బచ్చన్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని, బేటి బి నామకరణ వేడుక గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ఈ సందర్భంగా బేటి బి కోసం కోటిన్నర విలువ చేసే ఆడిఎ8 కారును కొంటున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











