పవన్ కళ్యాణ్...సైలెంట్ కిల్లర్ నిజమేనా?
పవన్ కళ్యాణ్ ని ఇప్పుడంతా సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తున్నారు. దానికి కారణం పంజా చిత్రం పోస్టర్స్. ఈ పోస్టర్స్ చూసిన వారు సైలెంట్ గా వచ్చి పవన్ ఓ రేంజి హిట్ కొడతాడని అంటున్నారు. అందులోనూ పంజా చిత్రానికి చెందిన ట్రైలర్స్ అన్నీ లో ప్రొఫైల్ లో పవన్ ని చూపించటానికి ప్రయత్నించాయి. దాంతో అంతటా ఎక్సపెక్టేషన్స్ పెరగకుండా చూసి ఒక్కసారిగా ప్రేక్షకులను ధియోటర్లలో అదిరిపోయేలా చేస్తాడంటున్నారు. అలాగే మాస్ ని టార్గెట్ చేయకుండా ప్రమోలు వదలటం కూడా అదే కారణం అంటున్నారు. ప్రతీసారి పవన్ సినిమా అంటే ఆకాశాన్నంటే ఎక్సపెక్టేషన్స్ తో ధియోటర్స్ లో దిగటం, తాము ఊహించిన దానికన్నా కాస్త తక్కువగా ఉన్నా బాగోలేదని టాక్ స్ప్రెడ్ అవటం గమనించిన పంజా క్యాంప్ ఈ నిర్ణయం తీసుకుని ఓ స్ట్రాటజీగా వస్తున్నాడంటున్నారు.
తమ పంజా చిత్రంలో దెబ్బ తిన్న పులి లాంటి పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనని దర్శకుడు విష్ణు వర్ధన్ అంటున్నారు. ఆయన తన తాజా చిత్రం పంజా చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ...ఒక్క దెబ్బతో నాడీ వ్యవస్థను సైతం విచ్ఛిన్నం చేసే పవర్ పులి పంజాకి సొంతం. అదే దెబ్బతిన్న పులి అయితే... దాన్ని పంజా శక్తి రెట్టింపవుతుంది. ఇక ఎదుట ఉన్నది మదగజం అయినా సరే.. మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇందులో పవన్‌కళ్యాణ్ పాత్ర చిత్రణ ఇదే తరహాలో ఉంటుంది. ఆయన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కి రుచి చూపించే సినిమా ఇది అన్నారు.
కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్ బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.


Click it and Unblock the Notifications











