ఎందుకీ మౌనం?: మహేష్ 'అజ్ఞాతవాసి'ని ఫాలో అవుతున్నాడా?..
Recommended Video

కథల విషయంలో సరైన జడ్జ్‌మెంట్ లేకనో.. మరేమో తెలియదు కానీ 'శ్రీమంతుడు' తర్వాత మహేష్ బాబు ఖాతాలో మరో హిట్టు సినిమా లేదు. అర్జెంటుగా ఇప్పుడాయనకు హిట్టు కావాలి. కొరటాల శివతో చేస్తున్న సినిమా పైనే ఇప్పుడు మహేష్ అశలన్ని. దీని తర్వాత మొదలైన సినిమాలు సైతం ఇప్పటికే టీజర్ విడుదల చేస్తే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇంతవరకు బయటకు రాలేదు.

ఏ అప్‌డేట్ లేదు..:
కొరటాల శివ-మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఇప్పటికీ టైటిల్ కూడా ఖరారు కాలేదు. 'భరత్ అను నేను' టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ.. దాన్నే ఫైనల్ చేస్తారన్న గ్యారెంటీ లేదు. అధికారికంగా దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇదొక్కటే కాదు అసలు సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ బయటకు రావట్లేదు.

'రీషూట్'పై అనుమానాలు..:
సినిమాకు సంబంధించి అంతా మౌనం వహిస్తుండటంతో 'రీషూటింగ్'పై అనుమానాలు బలపడుతున్నాయి. సినిమాలో కొన్ని సీన్స్ గతంలో వచ్చిన రానా 'లీడర్' సినిమాను పోలి ఉండటంతో దర్శకుడు కొరటాల శివ రీషూట్ ప్లాన్ చేశాడన్న ఊహాగానాలు వినిపించాయి.

మహేష్.. లేట్?:
ఓవైపు మహేష్ బాబు సినిమా కన్నా తర్వాత మొదలైన సినిమాలు కూడా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. బన్నీ నటించిన 'నా పేరు సూర్య' ఫస్ట్ ఇంపాక్ట్ ఇప్పటికే విడుదలై అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. కానీ మహేష్ సినిమాకు సంబంధించి మాత్రం ఇప్పటిదాకా ఏ విషయం బయటకు పొక్కలేదు.

'అజ్ఞాతవాసి'ని ఫాలో అవుతున్నారా?:
చూడబోతే.. దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు 'అజ్ఞాతవాసి'ని ఫాలో అవుతున్నారా? అన్న అనుమానం కలగకమానదు. అజ్ఞాతవాసి సినిమాకు కూడా ఆలస్యంగా ప్రమోషన్ మొదలుపెట్టారు.
విడుదలకు రెండు వారాల గడువులో టీజర్.. సాంగ్ విడుదల చేశారు. ఇక ట్రైలర్ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు రిలీజ్ చేశారు. మహేష్ బాబు సినిమాకు కూడా ఇలా విడుదల దగ్గరపడ్డాకే ప్రమోషన్ మొదలుపెడుతారా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ సినిమా పరిస్థితి వేరు..:
'అజ్ఞాతవాసి'కి సంక్రాంతి పండుగ కలిసొచ్చింది కానీ మహేష్ బాబు సినిమా పరిస్థితి వేరు. ఈ సినిమా వేసవిలో రానుంది. ఆ సమయంలో రజనీ2.0, నా పేరు సూర్య, రంగస్థలం లాంటి పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. కాబట్టి ఆ పోటీని తట్టుకోవాలంటే మహేష్ ఇప్పటినుంచే పబ్లిసిటీ మొదలుపెడితే బెటరేమో అనేవాళ్లు లేకపోలేదు.

కొరటాల గట్టెక్కిస్తాడా?:
బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు తీవ్రంగా నిరాశపరచడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు మహేష్. గతంలో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల శివ మరోసారి ఆయనతో జతకట్టడంతో తాజా ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి కొరటాల మహేష్‌ను ఫ్లాప్స్ నుంచి గట్టెక్కిస్తారా? లేరా? అన్నది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











