పాకిస్థాన్‌కు పాకిన ధనుష్ కొలవెరి
తమిళ హీరో ధనుష్ తన భార్య దర్శకత్వంలో రూపొందుతున్న '3' సినిమా కోసం 'కొలవెరి' పాటను రచించడంతో పాటు స్వయంగా పాడిన విషయం తెలిసిందే. తమిళ సినిమా పాట అయినప్పటికీ సాహిత్యం ఇంగ్లీషులో ఉండటం, పాట ట్యూన్ ఆకట్టుకునే విధంగా క్రేజీగా ఉండటంతో దేశం మొత్తం ఈ కొల'వెర్రి' పాకింది. యూట్యూబ్ లో అయితే ఈ పాట ఓ సంచలనం. 25 మిలియన్ల క్లిక్స్ సొంతం చేసుకున్న ఈ పాట యూట్యూబ్ గోల్డ్ లిస్టులోనూ చేరింది. అంతర్జాతీయంగా ఈ పాట తెగ ఫేమస్ అయిపోయిందిప్పుడు.
ఇంతటితో ఆగకుండా ఈ పాట ట్యూన్స్ ను, లిరిక్స్ ను ఆధారంగా చేసుకుని రాజకీయ నాయకులపై పేరడీ సాంగులు కూడా మొదలయ్యాయి. మన రాష్ట్ర విషయానికే వస్తే...చంద్రబాబు, జగన్ లపై సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో 'వైదిస్ సిబీఐ ఎంక్వయిరీ'అనే పేరడీ పాటను డిజైన్ చేశారు ఓ న్యూస్ ఛానల్ వారు.
తాజాగా ఈ పాట పాకిస్థాన్ లో హల్ చల్ చేస్తోంది. అక్కడ కూడా ఈ పాటను బేస్ చేసుకుని అక్కడి రాజకీయ నాయకులపై పేరడీ పాటలు కూడా రూపొందించారు. ప్రజాస్వామ్యం అస్తవ్యస్థం అయిన పాకిస్థాన్ లో 'వై దిస్ డెమొక్రసీ'అంటూ సాంగ్ చిత్రీకరించారు. పాకిస్థాన్ లో ఈ పాట ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











