టాలీవుడ్ హీరోల ఛాలెంజ్‌లు..పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఎవరు పట్టించుకోవడం లేదేంటి?
లాక్ డౌన్ సమయంలో సినీ తారలు ఎప్పుడు లేని విధంగా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్స్ ఉంటే రోజుకో ప్రాంతానికి వెళ్లే సినీ స్టార్స్ ప్రస్తుతం ఒకే చోట ఉంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం సరికొత్త ఛాలెంజ్ లతో ఆడియెన్స్ కి మంచి కిక్కిస్తున్నారు. ఇంట్లో పనులు చేసుకుంటూ ఇతర నటీనటులకు కూడా అదే తరహాలో ఛాలెంజ్ లు విసురుతున్నారు.
Recommended Video

అక్కడి నుంచి...
#Betherealman అనే హ్యాష్ ట్యాగ్ ని మొదట అర్జున్ రెడ్డి దర్శకుడు సందిప్ వంగా బాగా వైరల్ చేశాడు. ఆ ఛాలెంజ్ రాజమౌళి దగ్గరకు వెళ్లడంతో అక్కడి నుంచి స్టార్ హీరోల వరకు వెళ్లింది. దీంతో ఈ ఛాలెంజ్ ట్రేండింగ్ లిస్ట్ లో చేరిపోయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ఇలా చాలా మంది సినీ స్టార్స్ ఛాలెంజ్ లను పూర్తి చేసి వేరే స్టార్స్ ని నామినేట్ చేస్తున్నారు.

RRRహీరోలే హైలెట్..
రాజమౌళి నుంచి ఆ ఛాలెంజ్ రామ్ చరణ్, తారక్ లకు వెళ్లింది. ఆ తరువాత వారు మిగతా హీరోలను నామినేట్ చేశారు. బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియర్ హీరోలను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. శర్వానంద్, రానా వంటి స్టార్స్ కూడా ఈ ఛాలెంజ్ లను పూర్తి చేయాల్సి ఉంది.

ఆ హీరోలను పట్టించుకోరా?
ఈ ఛాలెంజ్ లలో నామినేట్ కావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలను నామినేట్ చేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కువ మంది అభిమానులు కలిగిన పవర్ స్టార్ మహేష్ బాబులను నామినేట్ చేస్తే చూడాలని ఆడియెన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ కూడా నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉన్న హీరో కాబట్టి ఇలాంటి మంచి పనుల్లో భాగస్వామ్యం అయితే బావుంటుందని కామెంట్స్ వస్తున్నాయి.

వారు ఆ పనుల్లో బిజిగానే ఉన్నారట..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎవరు నామినేట్ చేయకపోయినా ఆయన చాలా వరకు తన పని తాను చేసుకోవడంలో బిజిగానే ఉంటారు. ఇక మహేష్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ప్రభాస్ మాత్రం కాస్త రెస్ట్ తీసుకునే పర్సన్ కాబట్టి ఆయన ఎలాంటి పనులు చేస్తున్నారో తెలియదు. ఇక రానున్న రోజుల్లో వీరిని ఎవరైనా నామినేట్ చేసి #betherealman ఛాలెంజ్ లో బాగస్వామ్యులను చేస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











