»   » తుఫాన్ : మెగాస్టార్ స్థానంలో వెంకటేష్ అందుకేనా?

తుఫాన్ : మెగాస్టార్ స్థానంలో వెంకటేష్ అందుకేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'తుఫాన్' ఆడియో వేడుకకు చీఫ్ గెస్టుగా హాజరై మెగా అభిమానులను ఆశ్చర్య పరిచారు. సాధారణంగా రామ్ చరణ్ సినిమాల ఆడియో వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి అభిమానులను ఉత్సాహ పరుస్తుంటారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా మెగాస్టార్ స్థానంలో వెంకటేష్ హాజరయ్యారు.

అయితే వెంకటేష్ రాక వెనక ఓ ఆసక్తికర కారణం ఉందనే చర్చ సాగుతోంది ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. త్వరలో రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణలతో చిత్రాన్ని తీసేందుకు ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ప్లాన్ చేస్తున్నాడని, అందుకే ఈ సారి వెంకటేష్‍‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ముగ్గురు హీరోలకు ఈ కథను వినిపించినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తేజకు ఈ కథ బ్రహ్మాండంగా నచ్చడంతో కృష్ణవంశీ తదుపరి విక్టరీకి, కృష్ణలకు కూడా వినిపించి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. కాగా రామ్ చరణ్, వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ల ఎంపిక చేసే పనిలో ఉన్నాడట కృష్ణ వంశీ పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈచిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించే అవకాశం ఉంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం భారీ విజయం సాధించిన తర్వాత విక్టరీ వెంకటేస్ మల్టీస్టారర్ చిత్రాలపై దృష్టి పెడుతూ తన కెరీర్‌ను మరింత కాలం పొడగించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం తెలుగులో రామ్‌తో మల్టీస్టారర్ చిత్రంలో చేస్తున్నారు. దీని తర్వాత రామ్ చరణ్‌తో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

English summary
Venkatesh has stepped as chief guest for mega power star Ram Charan's Toofan audio lanch yester day. Eventually, this move will highlight the bond between Mega and Daggubati families and strength the reports of Venky-Charan multi-starrer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu