వెంకటేష్ డైరక్టర్ పై ఎందుకు కోప్పడ్డాడు?
కూల్ గా ఉండే వెంకటేష్ రీసెంట్ గా తన చిత్రం దర్సకుడు గోపీచంద్ మలినేని పై కోప్పడ్డాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కారణమేమిటన్నది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపక్ గా మారింది. ఇంతకి అస్సలు విషయమేమిటంటే...తన సినిమా అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలు వేరుగా ఉంటాయిని కాబట్టి వీటిని దర్శకుడు దృష్టిలో పెట్టుకోకుండా తమిళ సినిమాను మక్కికిమక్కీ కాపీ చేస్తున్నారనే వెంకటేష్ మండిపడ్డాడని తెలుస్తోంది. గతంలోనూ తానూ చంటి వంటి రీమేక్స్ తో సూపర్ హిట్ కొట్టానని, అయితే నాగవల్లి వంటివి పరభాషల్లో ఉన్నవి ఉన్నట్లుగా తీయటంతో పరాజయం పాలయ్యాయని చెప్పాట్ట. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా తీయమని చెప్పాట్ట. అందులోనూ బాడీగార్డ్ తమిళ రీమేక్ కావలన్ ప్లాప్ కావటం కూడా వెంకటేష్ ని టెన్షన్ లో పెడ్తోందని చెప్తిన్నారు. ఇక మళయాలంలో నయనతార, తమిళంలో అసిన్ నటించిన పాత్రని తెలుగులో త్రిష దక్కించుకుంది. 'డాన్ శీను' చిత్రానికి దర్శకత్వం వహించిన గోపీచంద్ తెలుగు బాడీగార్డుకు దర్శకుడు.


Click it and Unblock the Notifications











