తెలుగు అమ్మాయిలు వెనుకాడతారు అందుకే...రాజమౌళి
ముంబైలో పేరుపొందిన ప్రకటనల ఏజెన్సీలు బాలీవుడ్‌కు ప్రతిభగల అమ్మాయిలను అందిస్తాయని, దీనితో చాలామంది అమ్మాయిలు సినిమాలను ఒక కెరీర్‌గా ఎంచుకొని అక్కడ ఎదుగుతున్నారని చెప్పారు. ఇక్కడ అటువంటి ఏజెన్సీలు లేవన్నారు. అదీకాక ఒక ప్రకటనల ఏజెన్సీని సంప్రదించేందుకు ఇక్కడి అమ్మాయిలు వెనుకాడతారన్నారు ప్రముఖ దర్సకుడు రాజమౌళి. ఆయన తన తాజా చిత్రం 'మర్యాదరామన్న' విజయయాత్రలో భాగంగా విజయవాడలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే..రాష్ట్రంలో సినిమాల్లోకి ప్రతిభవున్న తెలుగు అమ్మాయిలు వచ్చేందుకు సరైన వేదిక లేనందున హీరోయిన్ పాత్రలకు హిందీ భామలను తీసుకోవడంతప్ప వేరే మార్గం తెలుగు దర్శకులకు వుండడంలేదని .రాజమౌళి అన్నారు.'మర్యాద రామన్న'ను ఓ పెద్ద చిన్నసినిమాగా రాజమౌళి చెప్తూ, ఇది 321 ప్రింట్లతో విడుదలైందన్నారు.


Click it and Unblock the Notifications











