Chalapathi Rao: అగ్నిప్రమాదంలో భార్య.. రెండో పెళ్లికి ప్రయత్నం.. అమ్మాయిలపై కామెంట్‌తో చనిపోవాలని!

తెలుగు సినీ ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెన్నంటుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే పరిశ్రమ ఎంతో మంది ప్రముఖులను కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే, రెండు రోజుల క్రితమే సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ మరణించారు. ఇది మరువక ముందే ఇప్పుడు మరో ప్రముఖ విలక్షణ నటుడు చలపతిరావు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. దీంతో టాలీవుడ్‌లో పెను విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో చలపతిరావు భార్య మరణం ఎలా జరిగింది? ఆయన కెరీర్‌ను ఇబ్బంది పెట్టిన వివాదాలు, విషాదాల గురించి తెలుసుకుందాం పదండి!

గుండెపోటుతో చలపతిరావు

గుండెపోటుతో చలపతిరావు

టాలీవుడ్‌లో యాభై ఏళ్లకు పైగానే తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటుడు చలపతిరావు.. గుండెపోటు కారణంగా ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. నటుడు చలపతిరావు మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

చలపతిరావుకు సంతాపంగా

చలపతిరావుకు సంతాపంగా

లెజెండరీ యాక్టర్ చలపతిరావు మరణంతో సినీ పరిశ్రమలో పెను విషాదం నెలకొంది. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చలపతిరావు మరణంపై పోస్టులు పెడుతూ ఆయన కుటుండానికి సానుభూతిని తెలుపుతున్నారు.

నవ్వించే పెదాల వెనకాలే

నవ్వించే పెదాల వెనకాలే

సాధారణంగా నటులు ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సాహసాలు చేస్తుంటారు. కానీ, వాళ్ల జీవితాల్లో ఎన్నో విషాదకర సంఘటనలు ఉంటాయి. అలాగే, చలపతిరావు లైఫ్‌లోనూ ఇలాంటి ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. భార్య మృతి నుంచి ఎన్నో వివాదాలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన తుదిశ్వాసను విడిచే వరకూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నమే చేశారు.

భార్య మరణంతో మొదలు

భార్య మరణంతో మొదలు

చలపతిరావు కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ఇందుమతిని వివాహం చేసుకున్నారు. వీళ్లకు వెంట వెంటనే ముగ్గురు పిల్లలు (రవిబాబు, మాలినీ దేవి, శ్రీదేవి) జన్మించారు. ఆ తర్వాత ఉదయాన్నే నీళ్లు వేడి చేసేందుకు కట్టెల పొయ్యి దగ్గరకు వెళ్లిన ఇందుమతి చీరకు నిప్పు అంటుకుని మరణించారు. ఈ ఘటనతో చలపతిరావు చాలా కాలం కోలుకోలేకపోయారు.

రెండో పెళ్లికి ప్రయత్నాలు

రెండో పెళ్లికి ప్రయత్నాలు

భార్య చనిపోయిన తర్వాత కూడా చలపతిరావు రెండో పెళ్లి మాత్రం చేసుకోలేదు. మొదట్లో కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చినా ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఏకంగా కొడుకు రవిబాబే తన తండ్రికి మళ్లీ పెళ్లి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, చలపతిరావు మాత్రం తన భార్యపై ఉన్న ప్రేమతో దీనికి నో చెప్పారు. అలా చనిపోయే వరకూ ఒంటరి జీవితాన్నే గడిపారు.

ఆ వివాదంతో ఆత్మహత్య

ఆ వివాదంతో ఆత్మహత్య

'రారండోయ్ వేడుక చూద్దాం' అనే సినిమా ఫంక్షన్‌లో చలపతిరావు ఆడవాళ్లపై కొన్ని వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఆ సమయంలో మహిళా సంఘాలు ఆయనపై పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపించాయి. సోషల్ మీడియాలో ఆయనపై అనుచిత పోస్టులు కనిపించాయి. దీంతో చలపతిరావు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు.

యాక్సిడెంట్‌తో సమస్యలు

యాక్సిడెంట్‌తో సమస్యలు

చలపతిరావు ఈ మధ్య కాలంలోనే ఓ సినిమా షూటింగ్ చేస్తోన్న సమయంలోనే ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన రెండు కాళ్లు పని చేయలేదు. ఫలితంగా చాలా కాలం పాటు వీల్ చైర్‌కే పరిమితం అయ్యారు. అప్పుడే కంటిచూపు సమస్యను కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' మూవీలో అవకాశం ఇచ్చి ఆయనకు మరో లైఫ్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X