Don't Miss!
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వకపోయినా నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డుల తాట తీస్తున్న నాగార్జున.. వైల్డ్ డాగ్ ట్రేండింగ్
కొన్ని సినిమాలు అసలు ఎలా హిట్టవుతాయి అనేది ఎవరికీ అర్ధం కాదు. హిట్టయిన సినిమా అందరికి నచ్చుతుందన్న గ్యారెంటీ లేదు. అలాగే ప్లాప్ అయినా సినిమా కూడా అందరికి నచ్చకుండా ఉండదు. అయితే ఈ రోజుల్లో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా కూడా కంటెంట్ రిజల్ట్ లో చాలా తేడా కనిపిస్తోంది. ఇక నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా కూడా థియేటర్స్ లో అనుకున్నంత స్థాయిలో హిట్టవ్వకపోయినా కుండా ఓటీటీలో మాత్రం రికార్డు స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది.
రిజల్ట్ ఎలా ఉన్నా కూడా
నాగార్జున ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక కొత్త పాయింట్ ను హైలెట్ చేసుకొని డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. ఎక్కువగా ప్రయోగాలు చేసే నాగ్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఒకే తరహాలో కెరీర్ గ్రాఫ్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఆయన చాలా రోజుల తరువాత చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ వైల్డ్ డాగ్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
అద్భుతమైన నటనతో
గోకుల్ చాట్ వంటి ప్రదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ వంటి ఆసక్తికరమైన విషయాలను ఆధారంగా చేసుకొని ఈ వైల్డ్ డాగ్ సినిమాను తెరకెక్కించారు. ఒక NIA ఆఫీసర్ గా నాగార్జున అద్భుతమైన నటనతో అభిమానులను సరికొత్తగా ఆకట్టుకున్నారు.
ఆ సినిమాలు హిట్టవ్వడంతో
ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఈ సినిమాను లాక్ డౌన్ కంటే ముందు వరకు కూడా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేయాలని అనుకోని డీల్ కూడా సెట్ చేసుకున్నారు. కానీ క్రాక్ ఉప్పెన వంటి సినిమాలు హిట్టవ్వడంతో మనసు మార్చుకోక తప్పలేదు.
అత్యదిక వ్యూవ్స్ అందుకున్న తెలుగు ఓటీటీ మూవీ
ఇక వైల్డ్ డాగ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద కలెక్షన్స్ అందుకోలేకపోయింది. థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో నెట్ ఫ్లిక్స్ లో ముందుగానే విడుదల చేశారు. రెండు రోజుల క్రితం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన వైల్డ్ డాగ్ భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. సౌత్ ఇండియాలోనే 48గంటల్లో అత్యదిక వ్యూవ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా టాప్ 10 ట్రెండ్ లిస్ట్ లో స్థానం అందుకోవడం విశేషం.