నాగబాబు కూతురే అంటూ ప్రచారం..(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి హీరోలే తప్ప హీరోయిన్లు ఎవరూ రాలేదు. తాజాగా ఆ ఫ్యామిలీ నుండి ఓ హీరోయిన్ రాబోతోందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం మొదలైంది.
త్వరలో అక్కినేని అకిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలిసారి వెండితెరపై జతకట్టేది ఎవరితో అనే చర్చలు ఈ మధ్య జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురి పేర్లు కూడా వినిపించాయి. తాజాగా నాగ బాబు కూతురు నిహారిక పేరు తెరపైకి వచ్చింది.
నిహారిక, అకిల్ కలిసి నటించడం ద్వారా సినిమాకు మంచి హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్, నిహారిక కలిసి ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. రాజమౌళి తనయుడు కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలో ఇంటర్నెట్లో విడుదల కానుందని సమాచారం.

అఖిల్, నిహారిక
ఇప్పటికే అఖిల్, నిహారిక షార్ట్ ఫిల్మ్‌లో కలిసి నటించారు. త్వరలో ఇద్దరూ కలిసి మెయిన్ స్ట్రీమ్ సినిమా ద్వారా వెండితెర అరంగ్రేటం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మెగా ఫ్యామిలీ నుండి
ఇప్పటి వరకు మెగా స్టార్ కుటుంబం నుంచి దాదాపు అరడజనుకు పైగా హీరోలు వెండి తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి ఒక్క హీరోయిన్ కూడా వెండి తెరకు పరిచయం కాలేదు. మెగాస్టార్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నప్పటికీ వాళ్లు మొదటి నుంచీ పూర్తిగా సినీ రంగానికి దూరంగానే ఉంటూ వచ్చారు. నిహారిక తెరంగ్రేటం చేస్తే ఆమె మెగా కుటుంబం నుంచి వచ్చే తొలి హీరోయిన్ అవుతుంది.

నాగబాబు సముఖం
నాగ బాబు తనయ నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఆమె ఆలోచనకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉంది. ఆ మధ్య నాగబాబు మీడియాతో మాట్లాడుతూ.....నిహారికకు ఇంట్రెస్టు ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసారు.

ఇంటలిజెంట్
నిహారిక చాలా తెలివైన అమ్మాయి అని, ఏ విషయాన్నయినా చాలా కూల్‌గా సాల్వ్ చేస్తుందని......నన్ను ఏ విషయంలోనైనా ఇట్టే కన్విన్స్ చేస్తుందని నాగబాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

నిహారిక
నిహారిక ఈ మధ్య ఏ కార్యక్రమానికి హాజరైనా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారుతోంది. ఆమె సినిమాల్లోకి వస్తుందనే ప్రచారం కూడా ఇందుకు ఓ కారణం కావొచ్చు. మెగా ఫ్యామిలీ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండటం కామనే...

కూతురుపై నమ్మకం
మెగా బ్రదర్ నాగబాబుకు తన కొడుకు వరుణ్ తేజ్ కన్నా...కూతురు నిహారికపైనే నమ్మకం ఎక్కువ అట. ఎందుకంటే వరుణ్ తేజ్ కన్నా, నిహారికనే చాలా ఇంటలిజెంట్ అంటున్నారు నాగ బాబు.

చాలా యాక్టివ్
నిహారిక చిన్నప్పటి నుంచి చాలా చురుకైన అమ్మాయి. అందరితో త్వరగా కలిసిపోయే తత్వం, ఏ పనయినా పర్ ఫెక్టుగా చేసే గుణం. వెరసి మెగా ఫ్యామిలీ అమ్మాయిల్లో నిహారికే బెస్ట్ అనే టాక్ మెగా ఫ్యామిలీ సన్నిహితుల నుంచి వినిపిస్తోంది.

పవన్, రామ్ చరణ్‌తో
పెదనాన్న చిరంజీవి అంటే నిహారిక భక్తితో పాటు కాస్త భయం కూడా ఉందట. అయితే బాబాయ్ పవన్ కళ్యాణ్ మరియు అన్నయ్య చరణ్‌తో ఆమె చాలా క్లోజ్ గా ఉంటుందని ఈ ఫోటో చూస్తే స్పష్టం అవుతోంది

బన్నీతో...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో నిహారిక చాలా సన్నిహితంగా ఉంటుంది. ఇక్కడున్న ఫోటో పరిశీలిస్తే నిహారిక, అల్లు అర్జున్ మధ్య ఉన్న స్నేహ పూర్వక బంధాన్ని అర్థం చేసుకోవచ్చు.

అల్లరి పిల్ల
ఇంట్లో వరుణ్ తేజ కంటే నిహారిక చాలా అల్లరి చేస్తుంట. ఈ విషయాన్ని నాగబాబు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్ని విషయాలు నాన్న ముందు ధైర్యంగా డీల్ చేయడానికి వరుణ్ భయపడతాడట. అలాంటపుడు నిహారిక హెల్ప్ తీసుకుని నాన్నను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడట వరుణ్.

ముద్దుల కూతురు
నాగబాబుకు నిహారిక ముద్దుల కూతురుగా చెప్పుకోవచ్చు. నిహారికను నాగబాబు ఎంతో గారాబంగా పెంచారు. అన్ని విషయాల్లోనూ ఆమెకు పూర్తి స్వేచ్చనిచ్చారు. తన కూతురును చూసి నేను ఎంతో గర్వ పడతాను అని నాగబాబు చెప్పుకుంటున్నారంటే నిహారిక గురించి అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











