బన్నీ ఖాతాలో మొన్న కాజల్, నిన్న భాను మెహ్రా, నేడు తమన్నా, రేపు...?
బద్రినాథ్ సినిమా కోసం కాకపోయినా, ఆ సినిమాకి ముందు సౌత్ స్కోప్ కోసం అల్లు అర్జున్, తమన్నా ఓ హాట్ ఫోటోసెషన్లో పాల్గొన్న సంగతి తెల్సిందే. అల్లు అర్జున్, తమన్నా సౌత్ స్కోఫ్ కోసం పెట్టిన ఎరోటిక్ ఫోస్ కాస్తా, టాలీవుడ్ లోహాట్ టాపిక్ అయ్యంది అప్పట్లో. ఇక, బద్రినాథ్" లో తమన్నా ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోవడం ఖాయమని జనం అనుకుంటోంటే, తమన్నాతో బద్రినాథ్"లో లిప్ కిస్ సన్నివేశం వుంటుందని ప్రకటించేశాడు అల్లు అర్జున్. అనుకోకుండా 'వరుడు" సినిమాలో లిప్ కిస్ కుదిరిందనీ, తదుపరి చిత్రంలోనూ హీరోయిన్ తో లిప్ కిస్ వుంటుందనీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. మెత్తమ్మీద, ఆ మధ్య లిప్ కిస్ పెట్టాల్సొస్తే సినిమానే వదులుకుంటానని చెప్పిన తమన్నా, బన్నీ కోసమే 'బద్రినాథ్" సినిమాలో లిప్ కిస్కి అంగీకరించిందనుకోవాలేమో! మొన్న కాజల్, నిన్న భాను మెహ్రా, నేడు తమన్నా, రేపు...? ఇలా ముద్దుల వర్షం కురిపిస్తుంటే త్వరలో బన్నీ ముద్దుల ప్రియడు అయిపోవడం ఖాయం.
అన్నట్టు, అల్లు అర్జున్, తమన్నాల మధ్యన 'బద్రీనాథ్" లో హై ఓల్టేజ్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయని ఫిలిం సర్కిల్స్ లో హాట్ హాట్ కామెంట్స్ విన్సిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











