Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ సెంటిమెంట్ భాను పై పడుతుందా!? లక్కీ బ్యూటీ అవుతుందా!?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ హీరోనే అయినా, తనతో పాటు చేసే హీరోయిన్ లకి మాత్రం దురదృష్టం వెంటాడుతూ ఉంది. ఎందుకంటే, మొదటి సారి బన్నీ తో చేసిన అదితి అగర్వాల్(గంగోత్రి), అనూరాధా మెహతా(ఆర్య), గౌరీ ముంజాల్(బన్నీ)లు ముగ్గురూ టాలీవుడ్ లో ఒక్క సినిమాలో వెలిగి తరువాత మాయమయ్యారు. అనూ మెహతా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆర్య తర్వాత ఆ స్థాయి హిట్ ఆమె ఖాతాలో పడలేదు. ఒక్క హన్సిక, జెనీలియా మాత్రమే ఈ లిస్ట్ నుండి మినహాయింపు.
కానీ'వరుడు" సినిమా ద్వారా పరిచయమైన భాను హీరోయిన్ గా తన టాలెంట్ ను నిరూపించుకొన్నది. అయితే మిగిలిన హీరోయిన్స్ లా భాను కి దురదృష్టం పట్టుకొంటుందో లేదా అదృష్టం వరిస్తుందో లేదో వేచి చూడాలి. అయితే ఇప్పుడు భానుశ్రీ మెహ్రాకి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అన్నది ప్రస్తుతానికి మిధ్యే. ఇంతవరకైతే ఈ అమ్మడు వేరే ఏ ఒక్క సినిమా కూడా ఓప్పుకోలేదని సమాచారం. అయితే హన్సీక కోలివుడ్ టాలీవుడ్ లోనూ, జెనీలియా టాలీవుడ్, బాలీవుడ్ లో తెరగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే సో అల్లు అర్జున్ సెంటిమెంట్ లక్కీ బ్యూటీస్ కి వర్తించదు.